‘గ్యాంగ్ లీడర్’ మేకింగ్.. ఫన్ అండ్ ఎమోషన్!
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiznnF_dSNJNvA7yvMGlS2F8Mp5p3q7_b2yjJ-12wu0tJ_HB8Frugro8tY7agbK2o40802tzyVnkF7SLEmUEF0SRc3h4PFPyKfHtXXVQw_fa3WMWAne87UyT4uozsGJ74M24g_TnYYg4Wc/s320/Movie.jpg)
![](https://telugu.samayam.com/photo/71076048/photo-71076048.jpg)
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన తాజా చిత్రం ‘నానీస్ గ్యాంగ్ లీడర్’. ప్రియాకం అరుల్ మోహన్ హీరోయిన్. కార్తికేయ కీలక పాత్రలో నటించారు. లక్ష్మి, శరణ్య, అనీష్ కురివిళ్ల, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిషోర్, ప్రాణ్య, సత్య ముఖ్య పాత్రలు పోషించారు. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవి యలమంచిలి, మోహన్ చెరుకూరి నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘గ్యాంగ్ లీడర్’పై నాని అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి కారణం మంచి ప్రచారం. టీజర్, ట్రైలర్, పాటలు, ప్రెస్ మీట్లు ఇలా ప్రతి విషయంలో చిత్ర యూనిట్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రచారం చేసింది. హీరో నాని.. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో స్వయంగా ప్రచారం నిర్వహించారు. నిన్న రాత్రి వైజాగ్‌లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఇప్పుడు సినిమా మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఈ మేకింగ్ వీడియో చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంది. Also Read: ‘గ్యాంగ్ లీడర్’ షూటింగ్ ఎంత జాలీగా, ఎమోషనల్‌గా సాగిందో మేకింగ్ వీడియో చూస్తే అర్థమవుతోంది. సినిమాలో కామెడీతో ఎమోషన్ ఒక రేంజ్‌లో ఉంటుందని మేకింగ్ వీడియోలో దర్శకుడు విక్రమ్ రియాక్షన్ చూస్తే స్పష్టమవుతోంది. ఒక సన్నివేశం చిత్రీకరణలో విక్రమ్ కట్ చెప్పి నటీనటుల నటనకు ఆయన ఎమోషన్ అయి కంటతడి పెట్టారు. అలాగే, వీడియో ఆఖరిలో కట్ చెప్పి పైకిలేచి సూపర్ అంటూ సింబాలిక్‌గా చూపించారు. ఈ మేకింగ్ వీడియో చూస్తుంటే థియేటర్‌లో నాని అండ్ గ్యాంగ్ నవ్వులు పూయించడంతో పాటు ఏడిపించడం ఖాయంగా కనిపిస్తోంది. శుక్రవారం ఈ సినిమాను వెండితెరపై చూడటానికి సిద్ధంగా ఉండండి. ఆల్ ది బెస్ట్ ‘గ్యాంగ్ లీడర్’.
By September 11, 2019 at 11:26AM
No comments