Breaking News

చరిత్రలోనే ఇలా తొలిసారి.. బయటకెళ్లేందుకు బాబు యత్నం.. వాహనంలోనే నిరసన


‘చలో ఆత్మకూరు’కు పిలుపునిచ్చిన చంద్రబాబు పల్నాడు వెళ్లకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కానీ గృహ నిర్బంధం నుంచి బయటకొచ్చిన చంద్రబాబు.. తన వాహనంలో ఆత్మకూరు వెళ్లేందుకు ప్రయత్నించారు. బయల్దేరే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. బాధితులు వాళ్ల సొంత ఊళ్లకు వెళ్లేలా చూడాలని 9 రోజుల గడువు ఇచ్చినా.. ప్రభుత్వం, డీజీపీ స్పందించలేదన్నారు. అందుకే తాను స్వయంగా ఆత్మకూరు వెళ్లడానికి పిలుపునిచ్చానని తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నన్ను ఇంట్లోనే నిర్భంధించారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చిన నాయకులను పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారని బాబు ఆరోపించారు. అచ్చెన్నాయుడిని ఒక పోలీసు స్టేషన్ నుంచి మరో పోలీసు స్టేషన్‌కు తిప్పారన్నారు. మా ఇంటికి పని వాళ్లను సైతం రాకుండా అడ్డుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్న బాధితులకు భోజనం కూడా పంపకుండా అడ్డుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారని బాబు ఆరోపించారు. పరిపాలిస్తోన్న వ్యక్తి క్యారెక్టర్‌కు ఇది అద్దం పడుతుందని.. సీఎం జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. నన్ను ఇంట్లో పెడితే మీరు ఆపలేరు. మా నాయకులను ఇంట్లో నిర్బంధిస్తే ఆపలేరు. పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తే ఆపలేరని చంద్రబాబు ఆవేశంగా మాట్లాడారు. నిరంతరం ఉంటుందని స్పష్ట చేశారు. మీరు ఎప్పుడు వదిలిపెడితే అప్పుడు నేరుగా బాధితులను తీసుకొని ఆత్మకూరు వెళ్తానని పోలీసులకు తెలిపారు. డీజీపీగానీ, పోలీసులు గానీ ఎవరేం చేస్తారో చేసుకోండి. వాళ్ళ ఊళ్లలో వాళ్లు నివసించే హక్కు కల్పించేంత వరకు ఈ పోరాటం ఆగదని చంద్రబాబు స్పష్టం చేశారు. Read Also: తన వాహనంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్లడానికి ప్రయత్నించగా.. గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన వాహనంలోనే ఉండి నిరసన చేపట్టారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు.


By September 11, 2019 at 11:35AM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/chalo-atmakur-police-denies-chandrababu-naidu-to-go-out-from-home-tdp-chief-continues-protest-by-sitting-in-vehicle/articleshow/71076062.cms

No comments