Breaking News

బాలీవుడ్‌లో కాజల్ అంత చీపా?


పొరిగింటి కూర రుచి చూడాలని ఎవరికి ఉండదు చెప్పండి! అలానే టాలీవుడ్ హీరోయిన్స్ కి కూడా బాలీవుడ్ లో సినిమాలు చేయాలనీ కల ఉంటుంది. ఆ కలను నిజం చేసుకునేందుకు చాలా ట్రై చేస్తుంటారు మన హీరోయిన్స్. కొంతమంది సక్సెస్ అయితే కొంతమంది ఫెయిల్ అవుతారు. అయినా కానీ ప్రయత్నించడం మాత్రం ఆపరు. ఎందుకంటే ఒక్కసారి బాలీవుడ్‌లో సెటిల్ అయితే లైఫ్‌లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు.

ఈ ప్రయత్నంలోనే టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఉంది. ఆల్రెడీ ఈ బ్యూటీ బాలీవుడ్‌లో ‘సింగం, దో లఫ్జొంకి కహాని’ అంటూ రెండు అటెంప్ట్స్ చేసి చేతులు కాల్చుకుని కూడా మళ్లీ అక్కడ సినిమా చేయాలనీ చూస్తుంది. అది కూడా జాన్ అబ్రహంతో. రీసెంట్ గా ఈమె ‘ముంబయి సాగ’ సినిమాకు సైన్ చేసిందని తెలుస్తుంది. ఇందులో జాన్ అబ్రహం హీరో. ఈమూవీ కోసం కాజల్ కేవలం రూ.30 లక్షలు మాత్రమే పారితోషకంగా తీసుకుంటోందని ఇండస్ట్రీ వర్గాల టాక్.

తెలుగులో కనీసం కోటి రూపాయల రెమ్యునరేషన్ లేకుండా సినిమా చేయని కాజల్... హిందీ లో కేవలం 30 లక్షలకే చేయడం ఏంటో అర్ధం కానీ విషయం. అయినా హిందీ పైన ఈ అమ్మడుకి అంత మక్కువ ఏంటో?



By September 09, 2019 at 06:37AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/47352/kajal-agarwal.html

No comments