‘బిగ్ బాస్’లో మళ్లీ నాని.. నాగ్‌తో కలిసి స్టేజ్‌ను ఊపేసిన గోల్డ్
‘బిగ్ బాస్’ రెండో సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన షోను విజయవంతంగా నడిపించారు. నిజం చెప్పాలంటే నాని హోస్ట్‌గా చేసిన ఆ సీజన్ బాగా పాపులర్ అయ్యింది. రకరకాల వివాదాలతో హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే, ఇప్పుడు మూడో సీజన్‌కు కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సీజన్ అంత రంజుగా లేదని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. దీనికన్నా రెండో సీజన్ చాలా బాగుంది అంటూ అభిప్రాయపడుతున్నారు. అందుకేనేమో, ఈ సీజన్‌కు కొత్త ఊపు తీసుకురావడానికి మళ్లీ ‘బిగ్ బాస్’లో నాని అడుగుపెడుతున్నారు. ఆదివారం నాటి ‘బిగ్ బాస్’ ఎపిసోడ్‌లో నాని సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే స్టార్ మా ట్విట్టర్‌లో రెండు ప్రోమో వీడియోలను వదిలింది. నాగార్జున మన టీవీని కాకుండా తన పాత నా..ని టీవీ ద్వారానే నేచురల్ స్టార్ హౌస్‌లోని కంటెస్టెంట్లను పలకరించారు. టీవీలో నానీని చూసిన ఇంటి సభ్యులు ఆశ్చర్యంతో అరుపులు కేకలు పెట్టారు. ముఖ్యంగా శ్రీముఖి ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది. అలాగే, ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియను కూడా నాని ఆధ్వర్యంలో జరిగినట్లు ప్రోమో చూస్తుంటే అర్థమవుతోంది. హిమజ, శివజ్యోతి ఎందుకో బాగా ఎమోషనల్ అయ్యారు. బహుశా ఎలిమినేట్ అయిన వ్యక్తి గురించి అనుకుంటా! ఇదిలా ఉంటే, మరో ప్రోమోలో నాగార్జున, నాని జంటగా స్టేజ్‌ని ఊపేసారు. ‘‘ఒక్క స్టేజీ ఇద్దరు హోస్టులు’’ అంటూ నాగ్ పంచ్ విసిరారు. ‘దేవదాస్’ సినిమాలోని పేరుతోనే ‘‘గోల్డు.. వెళ్లిపోదామా’’ అని నానిని నాగార్జున అడిగారు. నాని నాగార్జున వెనుక నిలబడి ఏదో సరదాగా సైగలు చేస్తు్న్నారు. మొత్తంగా ఈవారం ఎపిసోడ్ ఫుల్ ఫన్‌తో సాగుతుందని స్పష్టంగా తెలుస్తోంది. ఇక, నాని బిగ్ బాస్ షోలోకి రావడానికి మరో కారణం కూడా ఉంది. ఈనెల 13న నాని ‘గ్యాంగ్ లీడర్’ సినిమా విడుదలవుతోంది. దీని ప్రచారంలో భాగంగా ఆయన బిగ్ బాస్‌కు వచ్చారు.
By September 08, 2019 at 02:35PM
No comments