Breaking News

విక్రమ్ ల్యాండింగ్ లోకేషన్ గుర్తించిన ఇస్రో.. సిగ్నల్స్ రికవరీకి ప్రయత్నాలు!


చంద్రుడిపై దిగుతూ 2.1 కిలోమీటర్ల దూరంలో నిలిచిపోవడానికి గల కారణాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శోధిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రుడి ఉపరితలంపై దిగుతూ 2.1 కిలోమీటర్ల దూరంలో సాంకేతాలు నిలిచిపోయిన విక్రమ్ ల్యాండర్‌ను గుర్తించింది. ల్యాండర్ క్రాష్ ల్యాండింగ్ అయినట్టు ఆర్బిటర్ పంపిన చిత్రాలు ద్వారా తెలుస్తోంది. దీనిపై ఇస్రో ఛైర్మన్ శివన్ మాట్లాడుతూ.. చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్‌ను ఆర్బిటర్ ద్వారా గుర్తించామని, ఈ సమాచారంపై విశ్లేషిస్తామని తెలిపారు. మరో రెండు మూడు రోజుల్లో దానితో కమ్యూనికేషన్ జరుపుతామని పేర్కొన్నారు. విక్రమ్ ల్యాండర్ థర్మల్ ఇమేజ్‌ను ఆర్బిటర్ చిత్రీకరించింది. కాగా, విక్రమ్‌ ల్యాండర్‌ ఆచూకీ కనుగొనే విషయంలో తమ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, వాటిని ఆపేయలేదని ఇస్రో ఛైర్మన్‌ కె.శివన్‌ తెలిపిన విషయం తెలిసిందే. ల్యాండర్‌తో తిరిగి అనుసంధానం కోసం 14 రోజుల పాటు ప్రయత్నాలు చేస్తామని ఆయన వివరించారు. చంద్రయాన్-2 యాత్ర చివర్లో నిర్వహించిన ‘పవర్‌ డిసెంట్‌’ అంచెలో నాలుగు దశలు ఉన్నాయని, మొదటి మూడు అద్భుతంగా సాగాయన్నారు. చివరిది మాత్రం సాఫీగా జరగకపోవం వల్లే ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయాయని శివన్ వివరించారు. తాజాగా ల్యాండింగ్ లోకేషన్ గుర్తించడంతో శాస్త్రవేత్తల్లో ఆశలు చిగురించాయి.


By September 08, 2019 at 02:09PM


Read More https://telugu.samayam.com/latest-news/science-technology/isro-gets-image-of-vikram-lander-on-the-lunar-surface-from-orbiter/articleshow/71033887.cms

No comments