చిత్తూరు జిల్లాలో 14ఏళ్ల బాలిక గ్యాంగ్ రేప్.. చావు బతుకుల్లో బాధితురాలు
జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఇంటి వద్ద తాతతో ముచ్చట్లు చెబుతున్న బాలికను ఆమె బంధువులే కారులో ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారం చేసి ఇంటి వద్ద వదిలేశారు. తీవ్ర అనారోగ్యానికి గురైన బాలిక కర్ణాటకలోని ఓ ఆస్పత్రిలో చావుబతుకులతో పోరాడుతోంది. ఈ ఘటన తాలూకు వివరాలిలా ఉన్నాయి. Also Read: చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం మంగళం పంచాయతీలోని ఓ మహిళ 14ఏళ్ల కుమార్తె, తండ్రితో కలిసి ఉంటోంది. ఈ నెల 10వ తేదీన బాలిక తన తాతతో ఇంటి బయట సరదాగా మాట్లాడుతోంది. ఆ సమయంలో ఆమె బంధువులు హరి, రాజుతో పాటు మరొక వ్యక్తి కారులో వచ్చి బాలిక నోరునొక్కేసి ఎత్తుకుపోయారు. బాలిక తాత ప్రతిఘంచినా ఫలితం లేకపోయింది. Also Read: ఆ బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన ఆ ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాగ ఇంటి సమీపంలో వదిలేసి వెళ్లిపోయారు. లేచి నిలబడలేని స్థితిలో ఉన్న బాధితురాలిని గమనించిన స్థానికులు తల్లికి సమాచారం ఇవ్వడంతో ఆమె పుంగనూరు ఆస్పత్రికి తీసుకెళ్లింది. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి కర్ణాటకలోని కోలారు మెడికల్ కాలేజీకి తీసుకెళ్లింది. బాలికకు మెరుగైన వైద్యం అందిస్తున్నప్పటికీ ఆమె పరిస్థితి మెరుగుకావడం లేదు. ఈ ఘటనపై బాలిక తల్లి సోమవారం పుంగనూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. Also Read:
By September 24, 2019 at 08:14AM
No comments