Breaking News

క్షీణించిన లాలూ ఆరోగ్యం.. ఆందోళనలో ఆర్జేడీ నేతలు


బిహార్ మాజీ ముఖ్యమంత్రి, అధినేత ఆరోగ్యం క్షీణించినట్టు వైద్యులు వెల్లడించారు. దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలిన లాలూకు సీబీఐ కోర్టు జైలు శిక్ష విధించగా, ఆయన 2017 నుంచి రాంచీ జైల్లో ఉన్నారు. అయితే, కొద్ది రోజుల కిందట లాలూ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో రాంచీలో రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చేర్పించి చికిత్స కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం లాలూ కిడ్నీ పనితీరు మరింత క్షీణించిందని, అది 50 శాతం నుంచి 37 శాతానికి పడిపోయిందని హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఆర్జేడీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రక్తపోటు, చక్కెర నిల్వలు కూడా నిలకడగా లేవని రిమ్స్‌కు చెందిన ఓ సీనియర్ వైద్యుడు శనివారం తెలియజేశారు. యాంటీబయాటిక్స్ అధిక మోతాదులో ఇవ్వడంతోనే లాలూ కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపిందని డాక్టర్ డీకే ఝా తెలిపారు. షుగర్‌తోపాటు పాలు అనారోగ్య సమస్యలతో సతమతమవుతోన్న లాలూ.. ఇటీవలే సర్జరీ చేయించుకున్నారు. ప్రస్తుతం లాలూకు చికిత్స అందజేస్తోన్న వైద్యుడు డాక్టర్ ఉమా ప్రసాద్ మాట్లాడూ.. ఆయన కిడ్నీ పనితీరు క్షీణించిందని, గ్లోమరూలర్ ఫిల్టరేషన్ రేటు పడిపోయిందని అన్నారు. బ్లడ్ షుగర్, బీపీ కూడా పెరిగాయని, ఆయన పరిస్థితి నిలకడగా లేదని అన్నారు. గతంతో పోల్చితే ఆయన తక్కువ ఆహారం తీసుకుంటున్నారని, ప్రస్తుతం మెడిసిన్స్ ఇస్తున్నామని డాక్టర్ పేర్కొన్నారు. శనివారం హుటాహుటీన రాంచీకి వచ్చిన లాలూ తనయుడు .. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైద్యుల ప్రకటనతో తమ అధినేత ఆరోగ్య పరిస్థితి గురించి ఆర్జేడీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.


By September 01, 2019 at 10:44AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/rjd-leader-lalu-prasad-yadavs-health-not-stable-kidney-function-dips-further/articleshow/70931528.cms

No comments