Breaking News

బిడ్డకు జన్మనిచ్చిన బాలిక...17 ఏళ్ల బాలుడి అరెస్టు


తమిళనాడులో మైనర్ బాలికలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. రోజూ ఎక్కడో చోట మైనర్ బాలికలపై అత్యాచారాలు జరగడం, వారు గర్భం దాల్చిన ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. నాలుగు రోజుల క్రితం తిరువణ్ణామళై జిల్లా ఆరణి తాలూకా పడవేడు గ్రామంలో 12ఏళ్ల బాలిక గర్భం దాల్చిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. పక్కింట్లో ఉండే 16ఏళ్ల బాలుడు ఆమెపై ఏడాదిగా లైంగిక దాడి చేస్తున్నాడని, అతడి వల్లే బాలిక గర్భం దాల్చినట్లు తేలడంతో అంతా దిగ్భ్రాంతి చెందారు. తాజాగా ప్లస్‌టూ(ఇంటర్) చదువుతున్న బాలిక బిడ్డకు జన్మనివ్వడం అక్కడ కలకలం రేపుతోంది. Also Read: తిరుప్పూర్ జిల్లా వడుకపాళెం ప్రాంతానికి చెందిన ప్లస్‌టూ విద్యార్థినికి నాలుగు రోజుల క్రితం కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. ఆమె గర్భంతో ఉన్నట్లు చెప్పిన డాక్టర్లు వెంటనే ప్రసవం చేయకపోతే తల్లీ బిడ్డకు ప్రమాదమని హెచ్చరించారు. దీంతో బాలిక శనివారం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం కోయంబత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. Also Read: ప్లస్‌టూ చదువుతున్న బాలిక తోటి విద్యార్థినితో ప్రేమలో పడిందని, వీరిద్దరు హద్దులు దాటడంతో గర్భం దాల్చినట్లు పోలీసులు చెబుతున్నారు. వీరి ప్రేమ వ్యవహారం బాలుడి ఇంట్లో తెలియడంతో అతడిని చదువు మాన్పించేసి కూలి పనులకు పంపిస్తున్నారని వెల్లడించారు. బాలిక తాను గర్భం దాల్చిన విషయం ఎవరికీ చెప్పకుండా సాధారణంగానే స్కూల్‌కి వెళ్తోందని నెలలు నిండటంతో ప్రసవం అయిందని తెలిపారు. బాలికను తల్లిని చేసిన బాలుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తమ కుమార్తె గర్భంతో ఉన్నట్లు తమకు తెలీదని ఆమె పేరెంట్స్ చెప్పడం గమనార్హం. Also Read:


By September 01, 2019 at 10:37AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/tamilnadu-teenage-girl-gives-birth-to-girl-baby-minor-boy-held/articleshow/70931401.cms

No comments