మహిళలు స్నానం చేస్తుండగా వీడియోలు తీస్తున్న ఇద్దరిపై కేసు
మహిళలు స్నానాలు చేస్తున్న సమయంలో బాత్‌రూమ్‌ల్లోకి తొంగి చూస్తూ వీడియోలు తీస్తున్న ఇద్దరు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అపోలో ఆస్పత్రి సమీపంలోని జర్నలిస్ట్ కాలనీలో శిల్ప హెయిర్ కటింగ్ సెలూన్‌ను జంగయ్య అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. అతడి వద్ద మంజునాథ్ అనే యువకుడు పనిచేస్తున్నాడు. Also Read: ఆ కాలనీలో ఇళ్లన్నీ ఇరుకుగా ఉండటాన్ని ఆసరాగా చేసుకున్న వారిద్దరూ చుట్టుపక్కల మహిళలు స్నానాలు చేస్తున్న సమయాల్లో బాత్‌రూమ్‌ల్లోకి తొంగి చూడటం అలవాటు చేసుకున్నారు. దీనిపై స్థానికులు ఎన్నిసార్లు హెచ్చరించినా వారు వినకుండా మరింత రెచ్చిపోతున్నారు. కొన్నిసార్లు సెల్‌ఫోన్లో వీడియోలు కూడా తీస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ కామాంధుల ఆట కట్టించేందుకు కొందరు తమ ఇళ్లల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోగా వాటిని ధ్వంసం చేసేశారు. Also Read: వీరి ఆగడాలతో విసిగిపోయిన ఓ మహిళ జంగయ్య, మంజునాథపై బంజారాహిల్స్ పోలీసుకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితులిద్దరిపై ఐపీసీ 354(సి), 427, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వారిద్దరిపై స్థానికంగా ఆరా తీసి అరెస్ట్ చేస్తామని పోలీసులు చెబుతున్నారు. Also Read:
By September 01, 2019 at 11:43AM
No comments