పరువు హత్య.. ప్రేమపెళ్లి చేసుకుందని తల నరికేశారు
ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని పరువు తీసిందన్న ఆక్రోశంతో తల్లిదండ్రులే కన్న కూతురిని కిరాతకంగా చంపేశారు. పదునైన కత్తితో ఆమె తలను నరికేసి రాక్షసానందం పొందారు. తల్లిదండ్రులతో పాటు ఆ యువతి తోడబుట్టిన వారు సైతం ఈ హత్యలో భాగస్వాములు కావడం మరింత ఆందోళన కలిగించే విషయం. Also Read: హర్యానాలోని సోనిపట్ జిల్లాలోని గొహానా పట్టణానికి చెందిన రీతు(22) అనే యువతి స్థానికంగా ఉండే అర్జున్ అనే యువకుడిని ప్రేమించింది. అయితే ఆమె ప్రేమకు తల్లిదండ్రులు అడ్డు చెప్పడంతో రెండు నెలల క్రితం ఇంటి నుంచి పారిపోయి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంది. అయితే తమ కుమార్తె ప్రేమ వివాహం చేసుకుని తమ కుటుంబ పరువు తీసిందని రీతు పేరెంట్స్ రగిలిపోయారు. ఆ జంటను ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. Also Read: రీతు ఇంటి నుంచి వెళ్లిపోయినా తన చెల్లి అంజలితో టచ్‌లోనే ఉంది. ఆమెతో తరుచూ ఫోన్లో మాట్లాడుతూ తల్లిదండ్రుల బాగోగులు తెలుసుకుంటూ ఉండేది. ఈ క్రమంలోనే తనకు ఆరోగ్యం బాగోలేదని, ఆస్పత్రికి తీసుకెళ్లాలని అంజలి కోరడంతో రీతు భర్తతో కలిసి వచ్చింది. డాక్టర్‌ని కలిశాక తిరిగి వెళ్తున్న సమయంలో రీతు పేరెంట్స్ ఫోన్ చేసి ఇంటికి రావాలని కోరారు. దీంతో రీతు భర్తను కూడా రావాలని కోరగా అర్జున్ రానని చెప్పి తనింటికి వెళ్లిపోయాడు. Also Read: అయితే ఆదివారం ఉదయం పుట్టింట్లో శవమై కనిపించింది. ఆమె తల, మొండెం వేరుగా పడి ఉంది. తన భార్య హత్యకు గురైందని తెలుసుకున్న అర్జున్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు వెంటనే రీతు పుట్టింటికి వెళ్లి ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. అర్జున్ ఫిర్యాదు మేరకు రీతు తల్లిదండ్రులు, చెల్లి, అన్నతో పాటు బంధువులపైనా ఐపీసీ 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. పరువు పేరుతో కన్నకూతురినే పొట్టన పెట్టకున్న రీతు తల్లిదండ్రులపై స్థానికులు మండిపడుతున్నారు. Also Read:
By September 09, 2019 at 08:46AM
No comments