అబార్షన్ వికటించి యువతి మృతి.. రహస్యంగా దహనం చేసిన ప్రియుడు
జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతిని ప్రేమ పేరుతో లొంగదీసుకున్న యువకుడు ఆమెకు చేయించేందుకు చేసిన ప్రయత్నం విఫలమై ఆమెకు ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆమెను సమీప అటవీ ప్రాంతంలో పెట్రోల్ పోసి నిప్పంటించి ఏమీ తెలియనట్లు నటించాడు. పోలీసుల రంగ ప్రవేశంలో అతడు చేసిన ఘోరం వెలుగులోకి వచ్చింది. Also Read: కర్ణాటకలోని కలబుర్గికి చెందిన ఇస్తేరాణి శిభ(22) అనే యువతి డిగ్రీ సెకండియర్ చదువుతోంది. ఈ క్రమంలోనే ఓ యువకుడితో ప్రేమలో పడి హద్దులు దాటింది. దీంతో ఆమె గర్భం దాల్చింది. ఈ విషయం బయటపడితే తనకు చిక్కులు తప్పవని భావించిన ప్రియుడు ఆమెకు అబార్షన్ చేయించాలనుకున్నాడు. అయితే శిభకు ఆరో నెల రావడంతో అబార్షన్ చేయిస్తే ప్రమాదమని డాక్టర్లు చెప్పినా వినకుండా కలబుర్గిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గర్భస్రావం చేయించాడు. Also Read: అయితే అదికాస్తా వికటించి శిభ ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం బయటకు తెలిస్తే తాను జైలుకెళ్లాల్సి వస్తుందన్న ఆందోళన చెందిన ప్రియుడు తన ఫ్రెండ్ సాయంతో ఈ నెల 4న ఆమె మృతదేహాన్ని కారులో వేసుకుని వికారాబాద్ జిల్లా రంగంపల్లి శివారులోని హైదరాబాద్-బీజాపూర్ ప్రధాన రహదారి పక్కన పెట్రోల్ పోసి నిప్పటించాడు. ఆ తర్వాత గుట్టుచప్పుడు కాకుండా అక్కడి నుంచి పరారయ్యాడు. హైవే పక్కన సగం కాలిన మృతదేహాన్ని చూసిన వాహన.దారులు పరిగి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు దర్యాప్తు చేపట్టారు. యువతి వివరాలు తెలుసుకునేందుకు తెలంగాణతో పాటు కర్ణాటకలోకి కొన్ని పోలీస్‌స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. గుల్బర్గా జిల్లాలోని బ్రహ్మపూర్ పోలీస్‌స్టేషన్లో యువతి మిస్సింగ్ కేసు నమోదైనట్లు తెలుసుకుని ఆ దిశగా విచారణ చేపట్టి మృతురాలిని శిభగా గుర్తించారు. ఆమె స్నేహితులను ఆరా తీయగా ప్రేమ వ్యవహారం, అబార్షన్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో పరిగి పోలీసులు ఈ కేసును బ్రహ్మపూర్ పీఎస్‌కు బదిలీ చేశారు. శిభ ప్రియుడిని కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. Also Read:
By September 11, 2019 at 10:41AM
No comments