Breaking News

అందుకే ఆ కులం ట్వీట్ డిలీట్ చేశానంటున్న లావణ్య త్రిపాఠి


‘ఓ బ్రాహ్మణ అమ్మాయిగా ఈ కులం వారికి సమాజంలో ఎందుకింత అధమ స్థానం ఉందో నాకు అర్థం కావడంలేదు. మనం చేసే పనులు మన స్థాయిని తెలియజేస్తాయి కానీ కులం కాదు’ అని వివాదాస్పద ట్వీట్ చేశారు సినీ నటి . లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను ఉద్దేశిస్తూ ఆమె ఈ ట్వీట్‌ను చేశారు. ఆ తర్వాత ఎక్కడ వివాదాస్పదమవుతుందోనని భావించి వెంటనే దానిని తొలగించారు. శనివారం రాజస్థాన్‌లోని కోటా ప్రాంతంలో అఖిల బ్రాహ్మణ్ మహా సభను ఏర్పాటుచేశారు. ఈ సభకు ఓం బిర్లా వెళ్లారు. అక్కడ దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆయన ఓ ట్వీట్ చేశారు. ‘సమాజంలో బ్రాహ్మణులకు ఉన్నత స్థానం ఉంది. బ్రాహ్మణుల త్యాగం వల్లే ఈరోజు ఈ సభ ఏర్పాటైంది. అందుకే బ్రాహ్మణ సంఘం అందరికీ మార్గదర్శకంగా నిలుస్తోంది’ అని పేర్కొన్నారు. ఇందుకు లావణ్య స్పందిస్తూ పై విధంగా స్పందించి నాలుక్కర్చుకున్నారు. అయితే నిర్మొహమాటంగా ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడించినప్పుడు భయపడి ట్వీట్ ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చింది అంటూ నెటిజన్లు లావణ్యపై ప్రశ్నల వర్షం కురిపించారు. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో లావణ్య సమాధానమిచ్చారు. తన అభిప్రాయాన్ని వెల్లడించి అనవసరంగా ఇతరుల మనోభావాలను దెబ్బతీసి వివాదంలో చిక్కుకోకూడదనే ఆ ట్వీట్‌ను తొలగించానని లావణ్య అన్నారు. ఒక్కోసారి ఇలాంటి ట్వీట్లు తప్పుడు అర్థాలకు దారి తీస్తాయని అన్నారు. ఆ ట్వీట్ డిలీట్ చేసినప్పటికీ తాను కులం, మతం కంటే మనం చేసే పనుల ద్వారానే మన మంచితనం బయటపడుతుందని తాను నమ్ముతున్నానని పేర్కొన్నారు. వర్క్ పరంగా లావణ్యకు పెద్దగా అవకాశాలు రావడంలేదు. నిఖిల్‌కు జోడీగా నటిస్తున్న ‘అర్జున్ సురవరం’ సినిమా విడుదలకు నోచుకోలేకపోతోంది. దాదాపు ఏడాదిగా ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఎప్పుడు సినిమా విడుదల చేద్దామన్నా ఏవో ఒక అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ సినిమా తర్వాత లావణ్య మరో ప్రాజెక్ట్‌కు సంతకాలు చేయలేదు. ఇలాంటి సమయంలో అనవసరంగా వివాదాల్లో చిక్కుకోవడం ఎందుకని ముందుజాగ్రత్తగా లావణ్య తాను చేసిన ట్వీట్‌ను తొలగించేశారు.


By September 11, 2019 at 10:53AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actress-lavanya-tripathi-reasons-why-she-deleted-her-tweet-regarding-brahmin-pride/articleshow/71075640.cms

No comments