బాబు నిరాహార దీక్ష, రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఆందోళనలు.. జగన్ మాత్రం కూల్‌గా ఇలా..
‘చలో ఆత్మకూరు’ అని ఇచ్చి పిలుపునకు పోటీగా వైఎస్ఆర్సీపీ కూడా అదే పిలుపు అందుకుంది. దీంతో పల్నాడుతోపాటు గుంటూరు జిల్లాలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. చంద్రబాబు, నారా లోకేశ్ సహా పలువురు టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. శాంతియుతంగా తాము చేపడుతున్న చలో పల్నాడు కార్యక్రమాన్ని అడ్డుకోవడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడికక్కడ ధర్నాలు చేపట్టాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆయన కూడా ఇంట్లోనే నిరాహార దీక్షకు దిగారు. రాష్ట్ర ప్రజల దృష్టిని తమవైపు తిప్పుకోవాలని టీడీపీ ఆరాటపడుతుంటే.. సీఎం జగన్ మాత్రం కూల్‌గా ఇదేం అంత పెద్ద వ్యవహారం కాదన్నట్టుగా ఉంటున్నారు. పోలీసులకు ఈ వ్యవహారాన్ని వదిలేసిన సీఎం.. బుధవారం పలు అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. సచివాలయంలో బుధవారం ఉదయం 10.30 గంటలకు నూతన ఇసుక విధానంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ సమీక్ష ప్రారంభించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల విషయంలోనూ ఆయన సమీక్ష నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆయన ‘స్పందన’ కార్యక్రమంపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. Read Also: టీడీపీ నేతల ఆందోళనలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, తన ప్రభుత్వ ప్రాధాన్యాలకు తగ్గట్టుగా సమీక్షలు నిర్వహించాలి అన్నట్టుగా సీఎం జగన్ వైఖరి ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీడీపీకి కౌంటర్ ఇచ్చే బాధ్యతను పార్టీ నేతలకు అప్పగించిన ఆయన.. టీడీపీ ఏం చేస్తుందనే విషయాన్ని గమనించకుండా ఉన్నారనుకోలేం. కాకపోతే.. తాను స్పందిస్తే ఈ గొడవ మరింత పెద్దది అవుతుందని సీఎం భావిస్తుండొచ్చు కాబోలు.
By September 11, 2019 at 11:00AM
No comments