Breaking News

మహిళా ప్రయాణికురాలి ఎదుటే ఆటోడ్రైవర్ హస్తప్రయోగం


మహిళా ప్రయాణికురాలి ఎదుటే హస్తప్రయోగం చేస్తూ వేధింపులకు గురిచేసిన ఆటోడ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 1వ తేదీన ముంబయిలోని న్యూ లింక్ రోడ్‌ చించోలి బందర్ బస్‌స్టాప్ వద్ద ఓ మహిళ ఆటో ఎక్కింది. కొద్దిదూరం వెళ్లిన తర్వాత ఆటో ఆపిన డ్రైవర్ ఆమె ఎదుటే హస్తప్రయోగం చేస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. Also Read: అనంతరం ఆమెను గమ్యస్థానంలో దించేశాడు. అయితే ఆటోలో తనకు జరిగిన భయానక అనుభవంపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆటో నంబర్‌ ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు బుధవారం నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు పాత నేరస్థుడని, గతంలోనూ అనేక మంది మహిళలను ఇదే విధంగా వేధించిన కేసుల్లో నిందితుడిగాఉన్నాడని పోలీసులు తెలిపారు. ఆటోడ్రైవర్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. Also Read: ముంబయిలో ఆటోడ్రైవర్ల ఆగడాలు మితిమీరిపోవడంతో మహిళా ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. జులై నెలలోనూ 20ఏళ్ల యువతికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆటోలో ఎక్కిన యువతి చూస్తుండగా ఆటోడ్రైవర్ హస్తప్రయోగం చేసుకున్నాడు. ఈ విషయాన్ని యువతి సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో ముంబయి పోలీసులు స్పందించారు. కండివ్లి పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. Also Read:


By September 12, 2019 at 12:47PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/masturbating-in-front-of-female-passenger-mumbai-police-arrests-autorickshaw-driver/articleshow/71093475.cms

No comments