Breaking News

బీజేపీ నేత ఏడాదిపాటు రేప్ చేశాడు.. పక్కా ఆధారాలున్నాయి: లా స్టూడెంట్


నేత, మాజీ కేంద్ర మంత్రి స్వామి చిన్మయానందపై తన ఆశ్రమంలోని మహిళపై అత్యాచారాలకు పాల్పడుతున్నట్టు అక్కడ లా చదువుతోన్న విద్యార్థిని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆయనపై ఆరోపణలు చేసిన తర్వాత కనిపించకుండా పోయిన విద్యార్థినిని రాజస్థాన్‌లో ఉన్నట్టు గుర్తించారు. అంతకు ముందు తన కుమార్తె మిస్సింగ్ వెనుక చిన్మయానంద హస్తం ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు పట్టించుకోలేదు. దీంతో, ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం.. బాధితురాలిని తమ ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. కాగా, ఈ వ్యవహారం సోమవారం మరో మలుపు తిరిగింది. Read Also: తనపై ఏడాది నుంచి అత్యాచారానికి పాల్పడినట్టు ఆ విద్యార్థిని సోమవారం మీడియా ముందు వెల్లడించింది. ఏడాది పాటు చిన్మయానంద తనపై అత్యాచారం చేశాడని, దీనికి తన దగ్గర పక్కా ఆధారాలున్నాయని సంచలన వ్యాఖ్యలు చేసింది. సాక్ష్యాలను తగిన సమయంలో సిట్‌కు అందజేస్తానని ఆమె తెలిపింది. నేను, నా కుటుంబం భద్రత కోసమే ఓ వీడియోను పోస్ట్ చేయాల్సి వచ్చిందని, లేకపోతే చిన్మయానంద తనను చంపేసేవాడని మీడియా ముందు పేర్కొంది. షాజహాన్‌పూర్ పోలీసులు రేప్ కేసు నమోదుచేయలేదని, అధికారులు సహకరించకపోవడంతోనే నన్ను నేను రక్షించుకోడానికే పారిపోవాల్సి వచ్చిందని తెలిపింది. Read Also: యూపీ పోలీసులపై తనకు నమ్మకం లేదని, అందుకే ఢిల్లీలో ఫిర్యాదుచేసినట్టు వివరించింది. అలాగే ఢిల్లీలోకి స్థానిక న్యాయస్థానంలోనూ ఫిర్యాదుచేశానని బాధిత యువతి తెలియజేసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. చిన్మయానందపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థిని.. మొత్తం 12 పేజీలతో కూడిన వివరాలను అందజేసినట్టు సిట్ అధికారులు పేర్కొంటున్నారు. న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టడానికి ముందు ఆమె వాంగ్మూలాన్ని నమోదుచేసిన పోలీసులు, వైద్య పరీక్షల కోసం పంపనున్నట్టు తెలిపారు. సిట్ అధికారులు తనను ఎన్ని గంటలు విచారించినా ఇబ్బంది లేదు, కానీ నిందితుడిని అరెస్ట్ చేయాలని బాధిత యువతి డిమాండ్ చేసింది. ‘గతేడాది చిన్మయానందకు చెందిన స్వామి శుక్‌దేవానంద కాలేజీలో ఎల్ఎల్ఎం కోర్సులో చేరినప్పుడు తనకు ఉద్యోగం ఇప్పిస్తామని అన్నారు.. అప్పటి నుంచి తనను బలవంతంగా చాలాసేపు కాలేజీలోనే ఉంచే ప్రయత్నం చేశారని, దీంతో అక్కడ హాస్టల్‌లో ఉండాల్సి వచ్చింది.. అప్పటి నుంచి తనపై చిన్మయానంద చాలాసార్లు అత్యాచారం చేశాడని’ వెల్లడించింది. Read Also: అక్కడ ఉన్న చాలా మంది అమ్మాయిల జీవితాలను చిన్మయానంద చిదిమేశాడని, తాను మాత్రం అతడి ఆగడాలను ఎదురించాలని నిర్ణయానికి వచ్చానని పేర్కొంది. మరోవైపు, యువతి ఆరోపణలను చిన్మయానంద తరఫు లాయర్ కొట్టిపారేశారు. ఆగస్టు 24న బాధిత యువతి.. ఆశ్రమానికి చెందిన ఓ సీనియర్ నేత అనేక మంది అమ్మాయిల్ని లైంగికంగా వేధిస్తున్నాడని, తాను కూడా బాధితురాలినేనంటూ పేర్కొంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌చేసిన వీడియో వైరల్‌గా మారింది. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం కేంద్ర మంత్రిగా పనిచేసిన స్వామి చిన్మయానంద.. మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. గతంలోనూ ఈయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఆశ్రమంలోని ఓ మహిళపై అత్యాచారం చేసినట్టు 2011లో కేసు నమోదయ్యింది.


By September 10, 2019 at 12:26PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/ex-union-minister-bjp-leader-chinmayanand-raped-me-for-a-year-i-have-proof-says-law-student/articleshow/71061446.cms

No comments