Breaking News

బన్నీ దెబ్బకు కథ మార్చేసిన సుక్కు!


అవును.. బన్నీ దెబ్బకు సుకుమార్ కథ మొత్తం మార్చేశాడట. ఇప్పటికే ఒకరిద్దరు హీరోలు.. ముఖ్యంగా సూపర్‌స్టార్ మహేశ్ సుక్కుకు రెడ్ సిగ్నల్ ఇవ్వడంతో గత్యంతరం లేక అల్లు అర్జున్ కోసం తాను రాసుకున్న కథ మార్చేసినట్లు సమాచారం. అంతేకాదండోయ్ ఆ కథ కూడా అల్లువారబ్బాయి చెప్పిన లైన్ ప్రకారమే మార్పులు చేర్పులు చేశాడట. 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో సుకుమార్ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అల .. వైకుంఠపురములో’ సినిమా రిలీజ్ అయిన కొద్దిరోజులకే షూటింగ్ షురూ చేయాలని సుక్కు ఫిక్స్ అయ్యాడు. అయితే..  ఇప్పటికే కథ రెండు సార్లు మార్చేశారట. మొదట ఈ సినిమా మొత్తం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుందని బన్నీకి సుక్కు వినిపించగా.. మొదట కాస్త డిఫరెంట్‌గా ఉంది ఒకేనని చెప్పినప్పటికీ.. ఇటీవల ఆ నేపథ్యమున్న కొన్ని సినిమాలు ప్లాప్ అవ్వడంతో కథ మార్చేయాలని పట్టుబట్టాడట.

అంతేకాదు.. ‘ఆర్య’, ‘ఆర్య-2’ లాగా మంచి లవ్ ట్రాక్ ఉండేలా కథలో మార్పులు చేర్పులు చేయాలని బన్నీనే సుక్కుకి సలహా కూడా ఇచ్చాడట. దీంతో చేసేదేమీ లేక మళ్లీ తిష్టవేసిన సుకుమార్ స్టోరీలో గట్టిగానే మార్పులు చేశాడట. అనంతరం ఇటీవల షూటింగ్‌లో ఉన్న అల్లు అర్జున్‌కు స్టోరీ వినిపించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. సినిమా షూటింగ్‌కు ముందే పరిస్థితి ఇలా ఉంటే ఏ మాత్రం పట్టాలెక్కుతుందో.. మెగాభిమానులను ఆ సినిమా ఏ మాత్రం మెప్పిస్తుందే వేచి చూడాల్సిందే మరి.



By September 11, 2019 at 04:33AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/47379/sukumar.html

No comments