వృద్ధ కామాంధుడు.. 12ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం
తన సంస్థలో పనిచేస్తున్న మహిళ కుమార్తెపై లైంగిక దాడికి యత్నించి వ్యక్తిని తమిళనాడులోని పోలీసులు అరెస్ట్ చేశారు. మదురైకి చెందిన ఎం.రాజా(63) అనే వ్యక్తి ఓ టైలరింగ్ యూనిట్ నిర్వహిస్తున్నాడు. స్థానికంగా ఉండే ఓ మహిళ అందులో పనిచేస్తోంది. ఆదివారం ఆమె కుమారుడు, కుమార్తె(12) తల్లి పనిచేసే చోటు చూసేందుకు వెళ్లాడు. కాసేపటి తర్వాత బాలిక అలా బయటకు వెళ్లి వస్తానని తల్లికి చెప్పి ఒంటరిగా వెళ్లింది. కూతురు ఎంతసేపటికీ రాకపోవడంతో ఆందోళన పడిన తల్లి కుమారుడితో కలిసి వెతకసాగింది. సంస్థలోని అన్ని సెక్షన్లలోనూ వెతికినా బాలిక కనిపించలేదు. దీంతో యజమానికి ఈ విషయం చెప్పేందుకు అతడి క్యాబిన్‌కు వెళ్లిన తల్లి షాకైంది. తన కూతురుని యజమాని వివస్త్రను చేసి అత్యాచారం చేసేందుకు యత్నించడాన్ని చూసి తట్టుకోలేకపోయింది. యజమానిని పక్కకు తోసేసి తన కూతురిని రక్షించింది. అంకుల్ తనను లోపలికి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడని, ఎవరికైనా ఈ విషయం చెబితే మీ అమ్మ, అన్నను చంపేస్తానని బెదిరించాడని బాలిక తల్లికి చెప్పింది. దీంతో ఆమె తన కూతురిని తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి యజమానిపై ఫిర్యాదు చేసింది. దీనిపై విచారించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గమనిక: అత్యాచారాలు, లైంగిక వేధింపుల కేసుల్లో బాధితులకు సంబంధించి గోప్యత పాటించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారి పేర్లు, వివరాలు వెల్లడించడంలేదు.
By September 10, 2019 at 12:16PM
No comments