Breaking News

వేములవాడ వరదలు... నిర్మాణంలో ఉండగానే కూలిన బ్రిడ్జి, నాణ్యతా లోపమే కారణం!


తెలంగాణలో నిజాం కాలంలో నిర్మించిన భవనాలు, వంతెనలు నేటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. నాడు నిర్మాణాల విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకున్నారో ఇప్పటికీ నిలిచి ఉన్న కట్టడాలే నిదర్శనం. కానీ ఇప్పుడు మాత్రం నిర్మాణంలో ఉండగానే కట్టడాలు కూలిపోతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జి భాగం పూర్తిగా ఒరిగిపోయింది. గత మూడు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు మూలవాగు పొంగిపొర్లుతోంది. వరద ప్రవాహం ధాటికి రూ.22 కోట్లతో నూతనంగా హైలెవల్ బ్రిడ్జికి సంబంధించిన రెండు పిల్లర్లు విరిగాయి. దీంతో బ్రిడ్జి విరిగి ఒరిగిపోయింది. భారీ వరద ప్రవాహం కారణంగా వంతెన నిర్మాణంలో వాడిన ఇనుప చువ్వలు కొట్టుకుపోయాయి. దీంతో బ్రిడ్జి దెబ్బతింది. నిర్మాణ పనుల్లో నాణ్యతా లోపించడంతోనే ఇలా జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత నాలుగేళ్లుగా మూలవాగుపై రెండు వంతెనలను నిర్మిస్తున్నారు. మొదటి వంతెన ఇప్పటికే పూర్తి కాగా.. రాకపోకలు సాగిస్తున్నారు. రెండో వంతెన నిర్మాణ దశలో ఉంది. బ్రిడ్జి నిర్మాణంలో ఉండగానే దెబ్బతింటే.. అది ఎంత నాసిరకంగా కట్టారో అర్థం చేసుకోవచ్చని పట్టణవాసులు మండిపడుతున్నారు. కాంట్రాక్టర్‌పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


By September 20, 2019 at 11:13AM


Read More https://telugu.samayam.com/telangana/news/vemulawada-mula-vagu-under-construction-bridge-collapsed-due-to-heavy-floods/articleshow/71213427.cms

No comments