BigiL: నా ఫ్యాన్స్ జోలికి రావొద్దు.. హెచ్చరించిన విజయ్
ప్రముఖ తమిళ నటుడు నటించిన చిత్రం ‘బిగిల్’. దర్శకుడు అట్లీ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నయనతార కథానాయికగా నటించారు. ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. గురువారం చెన్నైలో సినిమా ఆడియో లాంచ్‌ను గ్రాండ్‌గా ఏర్పాటుచేశారు. వేడుకకు అట్లీ, విజయ్, రెహమాన్ వచ్చి సందడి చేశారు. ఈ సందర్భంగా విజయ్ ఓ ఆసక్తికరమైన అంశం గురించి ప్రస్తావించారు. చాలా కాలంగా విజయ్ ఫ్యాన్స్‌కు సోల్ మీడియాలో సూపర్ స్టార్ అజిత్ ఫ్యాన్స్‌కు మధ్య మీ హీరో గొప్పా మా హీరో గొప్పా అనే వివాదం జరుగుతోంది. దీని గురించి విజయ్ ఆడియో లాంచ్‌లో మాట్లాడారు. ‘ఆన్‌లైన్‌లో ఫ్యాన్స్ తిట్టుకోవడం అనేది కామనే. కానీ ఈ గొడవ మితిమీరకూడదు. ఆ గొడవ ఫన్నీగా ఉండాలనే కానీ సీరియస్ అవ్వకూడదు. ఈ గొడవలు ఇతరులకు బాధకలిగిస్తున్నాయన్నప్పుడు వాటిని అక్కడితోనే ఆపేయాలి. సోషల్ మీడియాకు ఎంతో పవర్ ఉంది. దానిని మంచి కోసం ఉపయోగించుకోవాలి. శత్రువులను కూడా గౌరవించడం నేర్చుకోండి. నాపై సోషల్ మీడియాలో కామెంట్స్ చేసే వారిని కూడా గౌరవిస్తాను. సోషల్ మీడియాలో ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసేవారు తమకున్న నాలెడ్జ్‌తో సామాజిక అంశాలపై ఫోకస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. కొందరు రాజకీయ రౌడీలు రోడ్డుపై కనిపించే నా బ్యానర్లను, పోస్టర్లను మీరు చింపగలరు. అంతెందుకు నాకు కూడా హాని కలిగించగలరు. కానీ నా అభిమానుల జోలికి మాత్రం రావొద్దు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో సుభాశ్రీ అనే యువతి దుర్మరణం చెందింది. ఆమె గురించి సోషల్ మీడియాలో ఓ హ్యాష్‌ట్యాగ్ క్రియేట్ చేసి రోడ్డు ప్రమాదాలపై అవేర్‌నెస్ కల్పించండి’ అని పేర్కొన్నారు. విజయ్, అజిత్ అభిమానులనే కాదు.. ఇతర హీరోల అభిమానులు కూడా సోషల్ మీడియాలో మరో హీరో ఫ్యాన్స్‌ను ట్రోల్ చేస్తుంటారు. మా హీరో తోపు అంటూ కామెంట్లు పెడుతుంటారు. వారందరినీ ఉద్దేశించి విజయ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తనను టార్గెట్ చేయాలని చూస్తున్న కొందరు రాజకీయ రౌడీలకు కూడా విజయ్ కౌంటర్ ఇచ్చారు. విజయ్‌పై కోపంతో బ్యానర్లు చించడం వంటి ఘటనలు చూస్తూనే ఉన్నాం. తనపై కోపం ఉంటే తనతోనే చర్చించుకోవాలని కానీ తన ఫ్యాన్స్ జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. విజయ్ నటించిన ‘బిగిల్’ సినిమా స్పో్ర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కించారు. అక్టోబర్ 27న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
By September 20, 2019 at 10:54AM
No comments