Breaking News

ANR Birth Anniversary: తండ్రిని గుర్తుచేసుకుంటూ నాగార్జున ఎమోషనల్ పోస్ట్


తెలుగు చిత్ర పరిశ్రమకు అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారక రామారావు రెండు కళ్లలాంటివారని అంటుంటారు. అది నూటికి నూరు శాతం నిజమే. వారి వల్లే చిత్ర పరిశ్రమ ఈరోజు ఇంతటి స్థాయిలో ఉంది. వారిని స్ఫూ్ర్తిగా తీసుకుని ఎందరో టాలెంటెడ్ హీరోలు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు జయంతి. ఈ సందర్భంగా ఆయన కుమారుడు అక్కినేని నాగార్జున తన తండ్రిని గుర్తుచేసుకుంటూ ట్విటర్ వేదికగా ఎమోషన్ పోస్ట్ పెట్టారు. ‘ANRliveson.. ఈరోజు నాన్న పుట్టినరోజు. మమ్మల్ని మీ జీవితంలో భాగస్వామ్యులుగా చేసుకున్నందుకు థ్యాంక్యూ. మిమ్మల్ని మిస్సవుతాం. మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాం’ అని పేర్కొన్నారు. అక్కినేని కోడలు సమంత కూడా ఏఎన్నార్‌ను గుర్తుచేసుకున్నారు. తన ట్విటర్ ప్రొఫైల్ పిక్చర్‌లో నటించిన సినిమల్లోని పాత్రలన్నీ కలిపిన ఫొటోలన్నీ కలిపి ఉన్న ఇమేజ్‌ను పెట్టుకున్నారు. ఏఎన్నార్ మనవడు, నటుడు సుశాంత్ కూడా తన తాతగారితో ఉన్న అనుబంధాలను ట్విటర్‌లో పంచుకున్నారు. చిన్నప్పుడు తన తాతగారితో కలిసి దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ‘హ్యాపీ బర్త్‌డే తాతా.. నేను మీ జీవితంలో కొంతకాలమే భాగమై ఉన్నప్పటికీ ఎంతో గొప్పగా ఫీలవుతున్నాను. మరింత కష్టపడేలా మీరు మాలో స్ఫూర్తి నింపారు. మీరు మా హృదయాల్లో చిరకాలం నిలిచిపోతారు’ అని పేర్కొన్నారు. 1924 సెప్టెంబర్ 20న కృష్ణా జిల్లాలోని రామాపురంలో జన్మించారు నాగేశ్వరరావు. 1941లో వచ్చిన ‘ధర్మపత్ని’ సినిమాతో తన కెరీర్‌ను ప్రారంభించారు నాగేశ్వరరావు. ఆయన కెరీర్‌లో దాదాపు 244 సినిమాల్లో నటించారు. 1949 ఫిబ్రవరి 18న నాగేశ్వరరావు అన్నపూర్ణను వివాహం చేసుకున్నారు. తనను పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకొన్నందుకు ఆమె కుటుంబానికి ఎప్పటికీ రుణ పడి ఉంటానని, ఆమెపై ప్రేమతోనే తన వ్యాపార సంస్థలన్నింటికీ అన్నపూర్ణ అని నామకరణం చేశానని నాగేశ్వరరావు చాలా సందర్భాల్లో చెప్పారు. 2013లో ఏఎన్నార్‌కు క్యాన్సర్ వచ్చింది. మేజర్ సర్జరీ అయిన రెండు వారాల్లోనే ఆయన మనం సినిమా చిత్రీకరణలో పాల్గొన్నారు. ఇందులో నాగార్జున, నాగచైతన్య, అఖిల్, సమంత, అమల నటించారు. నాన్న చివరి జ్ఞాపకంగా ఓ సినిమా చేయాలని నాగార్జున కుటుంబీకులు మనం సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు. తన చివరి శ్వాస వరకూ సినిమాల్లో నటిస్తానని ఏఎన్నార్ చెప్పేవారు. 2014 జనవరి 22న ఏఎన్నార్ చివరి శ్వాస విడిచారు.


By September 20, 2019 at 11:23AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actor-akkineni-nagarjuna-emotional-post-on-his-father-akkineni-nageshwar-rao-birth-anniversary/articleshow/71213846.cms

No comments