లా స్టూడెంట్ రేప్ కేసు.. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత అరెస్ట్
కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత స్వామి చిన్మయానంద్ తన ఆశ్రమంలోని మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఓ యువతి గత నెల 24న సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. అంతేకాదు తనపై కూడా చిన్మయానంద ఏడాది పాటు అత్యాచారం చేశాడని, దీనికి సంబంధించిన ఆధారాలు తనవద్ద ఉన్నాయని ఆ యువతి మీడియాకు ముందు వెళ్లడించింది. దీంతో ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటుచేయాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీం ఆదేశాలతో చర్యలు ప్రారంభించిన యూపీ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటుచేసింది. Read Also: చిన్మయానందను పలుసార్లు సిట్ విచారించినా కేసు నమోదుచేయకపోవడంతో పోలీసులు తీరుపై బాధిత యువతి అసహనం వ్యక్తం చేశారు. తాను చనిపోతేగానీ చిన్మయానంద్‌పై కేసు పెట్టరేమోనంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రిపై కేసు నమోదుచేసిన యూపీ పోలీసులు శుక్రవారం ఆయనను ఉదయం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం చిన్మయానంద్‌ను షహారన్‌పూర్ ఆసుపత్రికి తరలించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. చిన్మయానంద్‌ను షహారన్‌పూర్‌లోని ఆయన ఆశ్రమంలో అరెస్ట్ చేసి, కట్టుదిట్టమైన భద్రత మధ్య హాస్పిటల్‌కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను న్యాయస్థానంలో హాజరుపర్చనున్నారు. Read Also: చిన్మయానంద్ వ్యవహారంపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. యూపీలోని బీజేపీ ప్రభుత్వం, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఉన్నావో రేప్ కేసు నిందితుడి కూడా కాపలా కాస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం చిన్మయానంద్ విషయంలోనూ ఇలాంటి వైఖరే అవలంభిస్తున్నారని దుయ్యబట్టారు. బాధితురాలు భయపడుతుంటే బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తోందో తనకు అర్ధం కావడంలేదని ప్రియాంక నిలదీశారు. మరోవైపు, చిన్మయానంద్‌ను తక్షణమే అరెస్ట్ చేయకపోతే నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడతానని బాధిత యువతి పోలీసులను హెచ్చరించింది. కాగా, ఈ ఘటనపై బీజేపీ అధికార ప్రతినిధి మనీశ్ శుక్లా మాట్లాడుతూ.. తమ ప్రభుత్వంలో చట్టం ముందు అందరూ సమానమేనని, సిట్ తన పనితాను చేసుకెళుతుందని అన్నారు. చిన్మయానంద్ అరెస్ట్ అనివార్యమైతే సిట్ తప్పకుండా అదుపులోకి తీసుకుంటుందని, శాంతి భద్రతల విషయంలో తాము రాజీపడే ప్రసక్తేలేదని అన్నారు. Read Also: యూపీలోని పలు ఆశ్రమాలు, విద్యా సంస్థలు నిర్వహించే స్వామి చిన్మయానంద్‌పై 2011లోనూ లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఆయన విద్యా సంస్థల్లో ఎంఎల్ చదువుతోన్న బాధిత యువతి.. బ్లాక్‌మెయిల్ చేసి తనపై ఆయన పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపణలు గుప్పించింది. ఏడాది పాటు చిన్మయానంద తనపై అత్యాచారం చేశాడని, దీనికి తన దగ్గర పక్కా ఆధారాలున్నాయని సంచలన వ్యాఖ్యలు చేసింది. సాక్ష్యాలను తగిన సమయంలో సిట్‌కు అందజేస్తానని ఆమె తెలిపింది. నేను, నా కుటుంబం భద్రత కోసమే ఓ వీడియోను పోస్ట్ చేయాల్సి వచ్చిందని, లేకపోతే చిన్మయానంద తనను చంపేసేవాడని మీడియా ముందు పేర్కొంది. షాజహాన్‌పూర్ పోలీసులు రేప్ కేసు నమోదుచేయలేదని, అధికారులు సహకరించకపోవడంతోనే నన్ను నేను రక్షించుకోడానికే పారిపోవాల్సి వచ్చిందని తెలిపింది.
By September 20, 2019 at 11:26AM
No comments