Breaking News

లిప్‌స్టిక్, గాగుల్స్‌లో స్పై కెమెరాలు.. మధ్యప్రదేశ్ సెక్స్ స్కామ్‌లో షాకిస్తోన్న వాస్తవాలు


మధ్యప్రదేశ్‌లో వీఐపీల హనీట్రాప్ కేసు దేశవ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. అందమైన యువతులతో వల విసిరి.. సెక్స్ వీడియోలను రికార్డ్ చేసి.. ప్రముఖులను బ్లాక్‌మెయిల్ చేసిన ఈ కేసులో రోజుకో కొత్త నిజం వెలుగులోకి వస్తోంది. రూ.3 కోట్లు ఇవ్వాలని లేదంటే అశ్లీల వీడియోను బయటపెడతామని.. తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ ఇంజినీర్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ కేసు బయటకు వచ్చింది. సెప్టెంబర్ 18, 19 తేదీల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుణ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పడక గదిలో సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియోలు, ఫొటోలు తీయడం కోసం ఈ ముఠా లిప్‌స్టిక్, కళ్లద్దాల్లో కెమెరాలను పెట్టింది. ఎవరికీ అనుమానం రాకుండా వీడియోలు తీయడం కోసం నిందితులు ఇలా చేశారు. ఆర్తీ దయాళ్ (29), మోనికా యాదవ్ (18), శ్వేతా విజయ్ జైన్ (39), శ్వేతా స్వప్నిల్ జైన్ (48), బర్కా సోనీ (34), ఓం ప్రకాశ్ కోరి (45)లను అరెస్ట్ చేసిన పోలీసులు వారి దగ్గర్నుంచి స్పై కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. Read Also: ఈ హై ప్రొఫైల్ సెక్స్ రాకెట్‌కు సంబంధించి అనేక వీడియో క్లిప్పింగులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సందట్లో సడేమియాలా కొన్ని మార్ఫింగ్ వీడియోలను కూడా వైరల్ చేస్తున్నారు. శ్వేతా జైన్ అనే మహిళ ఈ దందాను నడిపేదని, స్వచ్ఛంద సంస్థ ముసుగులో కాలేజీకెళ్లే అమ్మాయిలను ప్రలోభపెట్టి ఈ కార్యకలాపాలు కొనసాగించేదని పోలీసులు చెబుతున్నారు. ధనికులు, రాజకీయ నాయకుల దగ్గరకు అమ్మాయిలను పంపి.. వారు యువతులతో సన్నిహితంగా ఉన్న సమయంలో స్పై కెమెరా ద్వారా రహస్యంగా వీడియో తీసేవారు. అనంతరం వారికి వీడియో క్లిప్పింగ్‌లను పంపి భారీగా డబ్బులు డిమాండ్ చేసేవారు. పరువు పోతుందనే ఉద్దేశంతో చాలా మంది సైలెంట్‌గా డబ్బులు ఇచ్చేవారు. ఇలా పలువుర్ని బ్లాక్ మెయిల్ చేసి కోట్లాది రూపాయలు సంపాదించారని పోలీసులు భావిస్తున్నారు. Read Also:


By September 30, 2019 at 11:20AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/mp-honey-trap-case-cameras-in-lipstick-goggles-used-to-film-and-blackmail-victims/articleshow/71369547.cms

No comments