Breaking News

కీచక కానిస్టేబుల్.. మహిళను బెదిరించి లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం


క్రమశిక్షణకు మారుపేరుగా, ప్రజలకు అండగా నిలవాల్సిన పోలీసే కీచకుడిగా మారాడు. ఓ మహిళపై కన్నేసి బెదిరించి లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. జిల్లా పోలీసు శాఖలో తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనను ఉన్నతాధికారులు గోప్యంగా ఉంచారు. Also Read: నెల్లూరు జిల్లా కొడవలూరు పోలీస్‌స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న జానకిరామయ్య కోవూరులో కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఇటీవల శాఖాపరమైన పని నిమిత్తం అదే జిల్లాలోని ఓ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన ఆయన అక్కడ స్వీపర్‌గా పనిచేస్తున్న మహిళపై కన్నేశాడు. ఆమె ఫోన్ నంబర్ తెలుసుకుని మంచిమాటలతో దగ్గరయ్యాడు. ఇటీవల ఆ మహిళకు ఫోన్ చేసిన జానకిరామయ్య నీతో కొంచెం పని ఉంది నెల్లూరుకి రావాలంటూ చెప్పాడు. దీంతో ఆమె బస్సులో నెల్లూరుకు చేరుకుంది. బస్టాండ్‌లో ఆమెను కలుసుకున్న జానకిరామయ్య సమీపంలోని లాడ్జికి తీసుకెళ్లాడు. Also Read: ఏదో కీడు శంకించిన ఆమె లాడ్జికి ఎందుకని ప్రశ్నించగా రూమ్‌కి వెళ్లాక చెబుతానని అన్నాడు. లోనికి వెళ్లాక తలుపు గడియపెట్టిన తన లైంగిక కోరిక తీర్చాలని వేధించాడు. ఆమె తిరస్కరించడంతో అక్రమ కేసులు బనాయిస్తానని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత లాడ్జి నుంచి బయటకు వచ్చిన బాధితురాలు జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పింది. అనంతరం చిన్నబజారు పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి జానకిరామయ్యపై ఫిర్యాదు చేసింది. Also Read: దీనిపై నెల్లూరు డీఎస్పీ జె.శ్రీనివాసులు విచారణ జరిపి జానకిరామయ్యపై రేప్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. ఆయన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. డిపార్ట్‌మెంట్‌కే తలవంపులు తెచ్చే ఘటన కావడంతో ఉన్నతాధికారులు బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.


By September 09, 2019 at 12:01PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/sweeper-woman-raped-by-police-conistable-in-nellore/articleshow/71044348.cms

No comments