Breaking News

Amaravati నిర్మాణాన్ని ఆపడానికి జగన్ కుట్ర, కేంద్రం లేఖలు రాసినా స్పందించరేం: లోకేశ్


ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరోసారి విమర్శలు ఎక్కుబెట్టారు. రావాలి సీబీఐ.. కావాలి సీబీఐ అన్న వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఎందుకు భయపడుతోందని ఎద్దేవా చేసిన లోకేశ్.. సీఎం జగన్‌కు ఎంత లెక్కలేనితనమో అంటూ సెటైర్లు వేశారు. ‘‘రాజధానికి ప్రపంచబ్యాంక్ ఆర్థిక సాయం విషయంలో కేంద్రం దాదాపు నెల రోజులు ఎన్నో లేఖలు రాసింది. బ్యాంకుకు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాలని సమాచారమిచ్చింది. ఆఖరి క్షణంలో కూడా హెచ్చరించింది. అయినా వైసీపీ ప్రభుత్వం స్పందించలేదు’’ అని లోకేశ్ విమర్శలు గుప్పించారు. అమరావతి నిర్మాణాన్ని ఆపడానికి ఇది జగన్ పన్నిన కుట్ర కాకపోతే ఇంకేంటని లోకేశ్ ప్రశ్నించారు. ప్రజలందరూ కోరుకున్న రాజధాని నిర్మాణాన్ని ఆపే హక్కు మీకెవరిచ్చారని నిలదీశారు. మీ సొంత ఇళ్లను వందల కోట్లతో కట్టుకున్న మీరు, రాష్ట్ర ప్రజల కోసం ఒక అద్భుత రాజధాని అక్కర్లేదనే దుర్మార్గపు ఆలోచన ఎందుకు చేస్తున్నారని సీఎం జగన్‌ను ఉద్దేశించి లోకేశ్ ప్రశ్నించారు. అమరావతి నిర్మాణం కోసం రూ.2100 కోట్లను వరల్డ్ బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలని చంద్రబాబు సర్కారు భావించింది. కాగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక.. ప్రాధాన్యాలు మారడంతో.. అమరావతి అభివృద్ధి ప్రాజెక్ట్ నుంచి వరల్డ్ బ్యాంక్ తప్పుకుంది. ఈ విషయంలో మీ వైఖరి చెప్పాలని కేంద్రం లేఖలు రాసినా.. రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని లోకేశ్ ఆరోపించారు. Read Also:


By September 09, 2019 at 12:08PM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/tdp-leader-nara-lokesh-fires-on-ap-cm-ys-jagan-about-amaravati-world-bank-loan/articleshow/71044564.cms

No comments