Breaking News

ఆ హీరోలకు దేవుడిలా మారిన గురూజీ


సినిమా హిట్ అయినా, ప్లాప్ అయినా అందులో మేజర్ కంట్రిబ్యూషన్ డైరెక్టర్‌దే. అయితే కొంతమంది డైరెక్టర్స్ మాత్రం హిట్స్ ప్లాప్స్ అనే లెక్కలకు అతీతంగా ఉంటారు. అలాంటి డైరెక్టర్స్ లిస్ట్‌లో ఉండే పేరు త్రివిక్రమ్. అందుకే ‘అజ్ఞాతవాసి’ లాంటి ప్లాప్ తరువాత హిట్స్ మీద ఉన్న ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్‌కి ఛాన్స్ ఇచ్చారు. ఆయన కూడా ఆ ఛాన్స్ ఉపయోగించుకుని ‘అరవింద సమేత’తో హిట్టు కొట్టారు. వాస్తవానికి ‘అజ్ఞాతవాసి’ నుండే త్రివిక్రమ్ కొత్తదారి ఎంచుకున్నారు. అతను ఏ స్టార్ హీరోతో సినిమా చేస్తున్నా అందులో మరొక చిన్న హీరోకి మంచి పాత్ర రాస్తున్నారు. ‘అజ్ఞాతవాసి’ సినిమాలో హీరో పవన్ కళ్యాణ్ అన్న విషయం తెలిసిందే. పవర్‌ స్టార్‌ని ఢీకొట్టే విలన్‌గా మాత్రం ఆది పినిశెట్టిని ఎంచుకున్నారు. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది కాబట్టి సిట్యుయేషన్ అలా ఉంది. ఒకవేళ హిట్ అయ్యుంటే ఆదికి ఆఫర్స్ క్యూ కట్టేవి. ‘అజ్ఞాతవాసి’ తరువాత ఫెయిల్యూర్ ఇబ్బందిని మోస్తూ తెరకెక్కించిన సినిమా ‘అరవింద సమేత’. ఆ సినిమాలో హీరో ఎన్టీఆర్. విలన్‌గా జగపతి బాబుని ఎంచుకున్నారు. కానీ, అతనికి కొడుకు పాత్రలో హీరోగా కెరీర్ నత్తనడకన సాగుతున్న నవీన్‌ చంద్రని తీసుకున్నారు. ఆ సినిమా హిట్ అవ్వడంతో టాలీవుడ్‌లో బ్యాడ్‌ బాయ్ క్యారెక్టర్ లేదంటే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు అనగానే నవీన్‌ పేరు కూడా పరిశీలిస్తున్నారు. ఆ రేంజ్ మేకోవర్ ఇచ్చారు త్రివిక్రమ్. ఇక ఇప్పుడు గురూజీ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘అల.. వైకుంఠపురములో..’. రీసెంట్‌గా ‘చి.ల.సౌ’ సినిమాతో ఒక మోస్తరు విజయం అందుకుని సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న సుశాంత్‌కి ఒక మంచి పాత్ర ఇచ్చారు. ఎప్పుడో హీరోగా కెరీర్ మొదలుపెట్టిన సుశాంత్‌కి ఓకే అనిపించే సినిమాలే తప్ప హిట్ అని చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ లేవు. ఇప్పుడు ‘అల.. వైకుంఠపురములో..’ సినిమాతో ఆ లోటు తీరిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇలా పెద్ద హీరోల సినిమాల్లో సెకండ్ గ్రేడ్ హీరోలకు మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలు రాస్తూ, వాళ్ళ కెరీర్ ఎదుగుదలకు తోడ్పడుతున్న త్రివిక్రమ్ వాళ్ళ దృష్టిలో దేవుడేకదా. అయితే ఆయా పాత్రల్లో వాళ్ళ ప్రెజెన్స్ కూడా ఆ సినిమాలకు హెల్ప్ అవుతుంది. త్రివిక్రమ్ ఎంచుకున్న కొత్తదారి యంగ్‌ హీరోస్‌కి వరంగా మారింది. ముందు ముందు ఇంకెంతమంది యంగ్ హీరోస్ త్రివిక్రమ్ ఇచ్చే బంపర్ ఆఫర్ అందుకుంటారో చూడాలి.


By September 09, 2019 at 11:57AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/director-trivikram-srinivas-helping-second-grade-heroes/articleshow/71044368.cms

No comments