Breaking News

ట్యూషన్ ఫీజ్ కోసం డబ్బులిస్తే గోవా వెళ్లి ఎంజాయ్ చేశాడు


స్కూల్ ఫీజు కట్టమని తండ్రి ఇచ్చిన రూ.10వేలతో ఓ బాలుడు ఏకంగా గోవా వెళ్లి ఎంజాయ్ చేశాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని హిమయత్‌నగర్‌లో చోటుచేసుకుంది. రాజస్థాన్‌కు చెందిన బ్రిజేష్ అనే వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితమే కుటుంబంతో సహా నారాయణగూడకు వచ్చి నివాసముంటున్నాడు. అతడి కొడుకు(16) స్థానిక ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల పదో తేదీన గణేష్ నిమజ్జనం చూసేందుకు ట్యాంక్‌బండ్ వెళ్తానని బాలుడు కోరగా తల్లిదండ్రులు నిరాకరించాడు. బుద్ధిగా చదువుకుని టెన్త్ క్లాస్ మంచి మార్కులతో పాస్ కావాలని సూచించారు. Also Read: ట్యూషన్ ఫీజు కట్టాలని తండ్రి బాలుడికి రూ.10వేలు ఇచ్చాడు. దీంతో అతడు అదేరోజు రాత్రివేళ తండ్రి బైక్ తీసుకుని ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. 11వ తేదీ ఉదయం తల్లిదండ్రులు నిద్రలేచి చూడగా బాలుడితో పాటు బైక్ కనిపించలేదు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. బాలుడి సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా 12వ తేదీన కర్ణాటకలోని బెల్గాం సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడి నుంచి ఐదు రోజుల పాటు అన్ని ప్రాంతాలు తిరుగుతూ మంగళవారం(సెప్టెంబర్ 17)న గోవాకు చేరుకున్నాడు. బాలుడి కదలికలను పోలీసుల నుంచి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అతడి తండ్రి కూడా మంగళవారం గోవాకు చేరుకున్నాడు. Also Read: అక్కడికెళ్లాక ఆ తండ్రి కొడుక్కి ఫోన్ చేయగా.. నేను గోవాలో ఉన్నాను, రెండ్రోజుల్లో ఇంటికొచ్చేస్తానని చెప్పాడు. దీంతో అతడి తండ్రి నేను కూడా గోవాలోనే ఉన్నానని చెప్పగా ఇద్దరూ అంజనా బీచ్‌లో కలుసుకున్నారు. దీంతో కథ సుఖాంతమైంది. తన కుమారుడిని కలుసుకునేందుకు సాయం చేసి నారాయణగూడ పోలీసులకు ఆ తండ్రి థ్యాంక్స్ చెప్పి బాలుడిని ఇంటికి తీసుకెళ్లాడు. పిల్లల ప్రవర్తన, కదలికలపై తల్లిదండ్రులు నిఘా పెట్టాలని, లేకపోతే వారు దారి తప్పే అవకాశముందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. Also Read:


By September 18, 2019 at 11:08AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/hyderabad-boy-went-goa-without-parents-permission/articleshow/71179329.cms

No comments