వేరొకరితో అక్రమ సంబందం.. భర్తను చంపేసి చెత్తకుప్పలో పూడ్చేసింది
అక్రమ సంబంధం నేపధ్యంలో భర్తనే చంపేసిందో మహిళ. ఈ విషయం బయటపడకుండా ఉండేందుకు మృతదేహాన్ని డంపింగ్ యార్డులో పూడ్చేసింది. ఐదు రోజుల తర్వాత ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. Also Read: వివరాల్లోకి వెళ్లే.. జిల్లా వెల్దుర్తి మండలం పట్లవీడుకు చెందిన దొడ్డక ఆంజనేయులు (55) గొర్రెలు కాపరి. అతడికి భార్య లక్ష్మమ్మ, ఇద్దరు కుమారుడు ఉన్నారు. లక్ష్మమ్మపై అనుమానం పెంచుకున్న ఆంజనేయులు ఆమెను తరుచూ వేధిస్తున్నాడు. దీంతో భర్త వేధింపులు భరించలేక లక్ష్మమ్మ ఇద్దరు కుమారులను తీసుకుని మాచర్లలో నివాసముంటోంది. తిరిగి ఇంటికొచ్చేయాలని ఆంజనేయులు ఎన్నిసార్లు కోరినా ఆమె ససేమిరా అంటోంది. ఈ నేఫథ్యంలోనే ఈ నెల 5వ తేదీన ఆంజనేయులు భార్య దగ్గరికి వెళ్లి గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే లక్ష్మమ్మ ఆగ్రహంతో భర్తను కొట్టి చంపేసింది. నేరం బయట పడకుండా ఉండేందుకు మృతదేహాన్ని శివారు మండాది రహదారి పక్కన ఉన్న డంపింగ్‌యార్డుకు తీసుకెళ్లి పూడ్చేసింది. Also Read: ఐదు రోజులుగా ఆంజనేయులు కనిపించకపోవవడంతో ఏమయ్యాడని అందరూ లక్ష్మమ్మను అడగ్గా తనకేం తెలీదని చెబుతోంది. గురువారం ఆంజనేయులు తమ్ముడు అప్పారావు ఆమె వద్దకు వచ్చి తన అన్న ఏమయ్యాడని నిలదీయగా తనకేంద తెలీదని చెప్పింది. అయితే వదిన ప్రవర్తనపై అనుమానం వచ్చిన అప్పారావు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో భయపడి తన భర్తను చంపేసిన డంపింగ్ యార్డులో పూడ్చేసినట్లు చెప్పింది. దీంతో అప్పారావు మాచర్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల గురువారం ఆంజనేయులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టానికి తరలించారు.
By September 13, 2019 at 10:41AM
No comments