Breaking News

ఈ వీక్.. నానికి ఎదురే లేదు..!!


నాని గ్యాంగ్ లీడర్ థియేటర్స్‌లో కొచ్చేసింది. ఈ రోజే వరల్డ్ వైడ్‌గా విడుదలయ్యింది గ్యాంగ్ లీడర్. టైటిల్ వివాదాన్ని చాకచక్యంగా సాల్వ్ చేసుకుని.. సైలెంట్ గా షూటింగ్ చేసుకుని మంచి ప్రమోషన్స్ తో గ్యాంగ్ లీడర్ థియేటర్స్ లోకి అడుగుపెట్టింది. అయితే సోలో రిలీజ్ కావాలంటూ వాల్మీకి నిర్మాతలతో ప్యాచప్ అయ్యి.. వాల్మీకిని వెనక్కి పంపిన నాని గ్యాంగ్ లీడర్ కి కన్నడ సుదీప్ పహిల్వాన్ తో షాకిస్తాడని అనుకున్నారు. ఈగ సినిమాతో క్రేజ్ సంపాదించిన సుదీప్.. సై రా సినిమాలోనూ ఓ కీ రోల్ ప్లే చెయ్యడం, పహిల్వాన్ ప్రమోషన్స్ ని తెలుగులో గట్టిగా చేయడంతో.. తెలుగు ప్రేక్షకులకు సినిమా మీద ఆసక్తి ఏర్పడింది.

మరి గురువారమే ప్రేక్షకులముందుకొచ్చిన పహిల్వాన్‌కి ప్లాప్ టాకిచ్చారు ప్రేక్షకులు. ప్రేక్షకులే కాదు క్రిటిక్స్ కూడా పహిల్వాన్ బాగోలేదనేశారు. పహిల్వాన్ సినిమాలో మాస్ సినిమాకు కావాల్సిన బిల్డప్ సీన్లు, ఎమోషన్లు, లవ్, ఫన్, ఫ్యామిలీ పాయింట్స్ అన్ని ఉన్నప్పటికీ... అవేమి ప్రేక్షకుడిని ఇంప్రెస్ చేయలేకపోయాయి. హీరో సుదీప్ మేకోవర్ బాగానే వుంది. కానీ మేకోవర్ వల్ల మొహం కాస్త మారిపోయి.. సుదీప్ ని ఎక్కువసేపు చూడలేం. ఇక మరో నటుడు సునీల్ శెట్టి ఆకట్టుకున్నాడు.

కానీ సినిమాలో కామెడీ కొరత, రొమాంటిక్ సీన్స్ పండకపోవడం, సాంగ్స్ వినసొంపుగా లేకపోవడం ఒక ఎత్తైతే.. సినిమా కన్నడనుండి డబ్ అయితే.. సినిమా మొత్తం తమిళ డబ్బింగ్ మూవీ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. మరి నాని గ్యాంగ్ లీడర్‌కి పహిల్వాన్ అడ్డుపడతాడేమో అనే చిన్న డౌట్.. ఇప్పుడా సినిమా టాక్ సరిగా రాకపోవడంతో.. నానికి వన్ వీక్ వరకు ఎదురే లేదు.



By September 14, 2019 at 02:52AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/47427/nani-gang-leader.html

No comments