ఆరేళ్ల కుమార్తెను గొంతు నులిచి చంపేసిన తండ్రి

స్కూల్ ఫీజు కోసం డబ్బులు అడిగిన ఆరేళ్ల కూతురిని పొట్టన పెట్టుకున్నాడో దుర్మార్గుడు. హరియాణాలోని సమీపంలో గల దబ్‌ఖేరా గ్రామానికి చెందిన జస్బీర్ సింగ్‌కు భార్య హర్జీందర్ కౌర్, కుమార్తె(6) ఉన్నారు. దినసరి కూలీ అయిన జస్బీర్ సింగ్ వచ్చే సంపాదనలో ఎక్కువ భాగాన్ని తాగుడు అలవాటుకే వెచ్చిస్తున్నాడు. దీంతో ఆ కుటుంబానికి పూట గడవడమే కష్టంగా మారింది. Also Read: స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న అతడి కూతురు స్కూల్ ఫీజు కోసం కొద్దిరోజులుగా తండ్రిని డబ్బులు అడుగుతోంది. ఫీజు కట్టకపోతే రావొద్దని టీచర్లు ఆ బాలికకు చెప్పడంతో ఈ విషయాన్ని బుధవారం తండ్రికి చెప్పింది. తన దగ్గర డబ్బులు లేవని.. కొద్దిరోజుల తర్వాత ఫీజు కడతానని తండ్రి చెప్పడంతో మారాం చేసింది. Also Read: దీంతో మద్యం మత్తులో ఉన్న జస్బీర్ సింగ్ కూతురిని గొంతు నులిమి చంపేశాడు. కేకలు విని ఇంటి నుంచి బయటకు వచ్చిన హర్జీందర్ కౌర్ కుమార్తె విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి షాకైంది. వెంటనే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి భర్తపై ఫిర్యాదు చేసింది. పోలీసులు అక్కడికి చేరుకునే సరికే నిందితుడు పరారయ్యాడు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం ఆస్పత్రికి తరలించిన పోలీసులు నిందితుడిపై హత్యకేసు నమోదు చేసి అతడి కోసం గాలిస్తున్నారు. Also Read:
By September 27, 2019 at 11:43AM
No comments