ప్రియుడి ఇంటి ముందే విషం తాగిన యువతి.. కేసు నమోదు
ప్రేమించానంటూ వెంట తిప్పుకుని సరదాలు తీర్చుకున్న ప్రియుడు పెళ్లికి మొహం చాటేయడంతో ఆ యువతి భరించలేకపోయింది. అతడితో జీవితం పంచుకోలేనప్పుడు చావే శరణ్యమనుకుని ప్రియుడి ఇంటి ముందే విషం తాగేసింది. ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. Also Read: జిల్లా కేంద్రానికి చెందిన మంద ప్రశాంత్ అనే యువకుడు, ఓ యువతి ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వడంతో యువతి ప్రియుడితో హద్దులు దాటింది. అప్పటి నుంచి పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా ప్రియుడి మొహం చాటేస్తూ వస్తున్నాడు. గట్టిగా నిలదీసేసరికి పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పేశాడు. Also Read: దీంతో మోసపోయానని గ్రహించిన యువతి గురువారం ప్రియుడి ఇంటి ఎదుటే విషయం తాగేసింది. ఈ ఘటన చూసిన స్థానికులు వెంటనే ఆమెను మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించి ఆమె కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు మంద ప్రశాంత్‌పై మంచిర్యాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read:
By September 06, 2019 at 09:16AM
No comments