Breaking News

TDPకి ‘కాపు’ సెగ.. బాబుకు బై బై చెప్పనున్న కీలక నేతలు!


గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పరిస్థితి రోజు రోజుకూ దిగజారిపోతోంది. కీలక నేతలు ఆ పార్టీ నుంచి బయటకొస్తున్నారు. ఆపరేషన్ కమలం ప్రభావంతో.. రాజ్యసభ సభ్యులు, చంద్రబాబుకు సన్నిహితులైన సుజనా చౌదరి, సీఎం రమేశ్ బీజేపీ గూటికి చేరారు. వీరేకాకుండా పలువురు సీనియర్ నేతలు కూడా ఇప్పటికే కాషాయ కండువా కప్పుకున్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి దూరం అవుతుండగా.. ఇప్పుడు కాపు సామాజికవర్గ నేతలు కూడా పక్క చూపులు చూస్తున్నారు. గంటా శ్రీనివాస రావు నాయకత్వంలో కాపు నేతలు భారీ సంఖ్యలో బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. తాజాగా ఆయన వైఎస్ఆర్సీపీలో చేరతానే ప్రచారమూ జరుగుతోంది. గంటా సంగతి పక్కనబెడితే.. చాలా మంది కాపు నేతలు టీడీపీకి దూరం కావడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇద్దరు నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారే తోట త్రిమూర్తులు, . గురువారం తెలుగుదేశం పార్టీ కాకినాడలో నిర్వహించిన సమావేశానికి దూరంగా ఉన్నారు. సమావేశానికి రావాలని చంద్రబాబు సమాచారం పంపినా.. ఆయన వెళ్లలేదని తెలుస్తోంది. దీంతో తోట త్రిమూర్తులు వైఎస్ఆర్సీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఆయనకు వైఎస్ఆర్సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్ష పదవిని జగన్ ఆఫర్ చేశారని తెలుస్తోంది. త్రిమూర్తులుతోపాటు ఆయనతో టచ్‌లో ఉన్న కాపు నేతలు కూడా వైఎస్ఆర్సీపీలో చేరే అవకాశం ఉంది. ఇటీవలే ఆయన ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ బీజేపీ నేతలు కూడా తనతో టచ్‌లో ఉన్నారని చెప్పడం గమనార్హం. కాకినాడ ఎంపీగా పోటీ చేసిన చలమలశెట్టి సునీల్ కూడా చంద్రబాబు సమావేశానికి హాజరు కాలేదు. మరో కాపు నేత, వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధా కూడా టీడీపీ నుంచి బయటకొస్తారని ప్రచారం మొదలైంది. జనసేన నేత నాదెండ్ల మనోహర్‌తో ఆయన కలిసి ఉన్న ఫొటోలు బయటకొచ్చాయి. తూర్పుగోదావరి జిల్లాలోని దిండి రిసార్ట్స్‌లో జనసేన పార్టీ సమావేశాలు జరుగుతుండగా.. రాధా అక్కడ ప్రత్యక్షమయ్యారు. పవన్ కళ్యాణ్‌తోనూ ఆయన భేటీ అయినట్టు తెలుస్తోంది. దీంతో రాధా జనసేన గూటికి చేరతారనే ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఎన్నికల ముందే రాధా వైఎస్ఆర్సీపీని వీడిని టీడీపీలో చేరారు. ఆయనకు విజయవాడ ప్రాంత రాజకీయాలపై మంచి పట్టుంది.


By September 06, 2019 at 09:24AM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/kapu-leaders-thota-trimurthulu-and-vangaveeti-radha-may-leave-tdp-soon/articleshow/71003456.cms

No comments