Breaking News

వేరే పెళ్లి చేసుకుందని ప్రియురాలి గొంతు కోసిన యువకుడు


తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన యువతి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న ఆక్రోశంతో ఓ యువకుడు ఆమె గొంతు కోసి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన జిల్లా రామకృష్ణాపూర్‌‌లో గురువారం కలకలం రేపింది. Also Read: మంచిర్యాల జిల్లా పులిమడుగు గ్రామానికి చెందిన కమలాకర్‌.. దేవాపూర్‌కు చెందిన ఓ యువతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వారి ప్రేమను తిరస్కరించిన యువతి తల్లిదండ్రులు ఆమెను హైదరాబాద్‌లో ఉంటున్న ఓ వ్యక్తికిచ్చి పెళ్లి చేశారు. మెట్టినింటికి వెళ్లిన తర్వాత కూడా ఆమె ప్రియుడితో తరుచూ ఫోన్లో మాట్లాడేది. ఈ విషయాన్ని గుర్తించిన భర్త ఆమెను పుట్టింటికి పంపేశాడు. గురువారం ఆ యువతి రామకృష్ణాపూర్‌‌లోని రామాలయం సమీపంలో ఉండే తన అక్క ఇంటికి ఆమె వచ్చింది. Also Read: ఈ విషయం తెలుసుకున్న కమలాకర్‌ మద్యం మత్తులో అక్కడికి వచ్చి ఆమెను తనతో పాటు తీసుకెళ్లాడు. ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బీరు సీసాతో ఆమె గొంతు కోసి తాను కూడా గాయపరుచుకున్నాడు. యువతి కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని అంబులెన్స్ సాయంతో మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read:


By September 06, 2019 at 08:52AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/married-woman-attacked-by-her-lover-in-mancherial-district/articleshow/71002910.cms

No comments