Breaking News

వరంగల్‌లో విషాదం.. ఎస్ఐ ఉద్యోగం రాలేదని యువతి ఆత్మహత్య


ఎంతో కష్టపడి అన్ని పరీక్షల్లో క్వాలిఫై అయినా పోలీసు ఉద్యోగం రాలేదన్న ఆవేదనతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలో శుక్రవారం జరిగింది. ఉన్నత చదువులు చదివిని కూతురు ఉన్నతస్థాయికి వెళ్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగులుస్తూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఈ ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపింది. Also Read: వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్‌స్టేషన్ పరధిలోని క్రిస్టియన్ కాలనీకి చెందిన చిర్ర రవీందర్-రాణి దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. పెద్దకుమార్తె, కుమారుడికి వివాహం కాగా.. చిన్న కుమార్తె శ్రుతి ఎంబీఏ చదివి ఇటీవల ఎస్ఐతో పాటు కానిస్టేబుల్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుని అన్ని ఈవెంట్స్‌లో క్వాలిఫై అయింది. రిటర్న్ టెస్ట్‌లో 106 మార్కులు ఉద్యోగానికి ఎంపిక కాలేకపోయింది. Also Read: అప్పటినుంచి మనస్తాపంతో ఉంటున్న శ్రుతి శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉదయం తల్లిదండ్రులు నిద్రలేచి చూసేసరికి శ్రుతి ఫ్యాన్‌కు వేలాడుతోంది. దీంతో వెంటనే ఎంజీఎంకు తరలించగా అప్పటికే శ్రుతి చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీనిపై మిల్స్ కాలనీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రభుత్వం ఉద్యోగం రాకపోతే ఏదైనా ప్రైవేటు సంస్థలో మంచి ఉద్యోగం చూసుకోవాలని, దీనికే ప్రాణాలు తీసుకుని తమకు కడుపుకోత విధించాలా? అంటూ ఆమె తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. Also Read:


By September 28, 2019 at 07:35AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/warangal-young-woman-commits-suicide-due-to-not-selected-for-police-job/articleshow/71344563.cms

No comments