Breaking News

హైదరాబాద్‌ను చూస్తే ఆనందం.. అమరావతిని చూస్తే ఆవేదన: చంద్రబాబు


విజన్ 2020 లక్ష్యంతో నగరాభివృద్ధి కోసం శ్రమించానని చంద్రబాబు తెలిపారు. తాము అనుకున్న దాని కంటే ఎక్కువగా భాగ్యనగరం అభివృద్ధి చెందిందన్నారు. ప్రస్తుతం తెలంగాణకు వచ్చే ఆదాయంలో 60-70 శాతం వాటా హైదరాబాద్ నగరం నుంచే వస్తోందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత నగరాభివృద్ధిపై ఫోకస్ పెట్టానన్నారు. విజన్ 2050 లక్ష్యంతో అమరావతి ప్రాంత అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించానన్నారు. రైతుల నుంచి 34 వేల ఎకరాలను సమీకరించామన్నారు. హైదరాబాద్‌ పాత నగరం కాబట్టి.. రోడ్ల విషయంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని.. అమరావతి విషయంలో అలాంటి తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. అమరావతి అభివృద్ధి కోసం ఐదేళ్లు శ్రమించానన్న చంద్రబాబు.. హైదరాబాద్‌తో అమరావతి పోటీ పడాలని భావించానన్నారు. కానీ ఈ ప్రభుత్వం దాన్ని చంపేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఎకో సిస్టమ్ వచ్చి ఉంటే అమరావతి కంటిన్యూ అయ్యుండేదన్నారు. హైదరాబాద్‌ను చూస్తే ఆనందం కలుగుతుంది. అమరావతి ఎడారిగా మారిన తీరు చూస్తే చాలా ఆవేదన, బాధ కలుగుతుందని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. Read Also: ‘‘అమరావతికి విమానాల కోసం కొత్తగా టెర్మినల్ కట్టించాం. రన్ వే కోసం వెయ్యి ఎకరాలను సమీకరించాం. సింగపూర్ నుంచి విమానాలను రప్పించాం. ఇప్పుడు ఇవన్నీ రద్దయ్యాయి. కనెక్టివిటీ లేకుండా పోయింది. ఉదయం రావాల్సిన ఫ్లయిట్ మధ్యాహ్నం వస్తే.. రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ రావాల్సి వచ్చింది. వ్యాపారాలు లేవు, రియల్ ఎస్టేట్ లేదు. హోటల్స్ ఆక్యుపెన్సీ మొత్తం పడిపోయింది. ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. అవన్నీ చూస్తుంటే బాధగా ఉంది. ప్రజాస్వామ్యంలో నేను కూడా నిమిత్త మాత్రుణ్నే’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.


By September 27, 2019 at 12:26PM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/tdp-chief-chandrababu-naidu-feels-bad-about-amaravati-present-situation/articleshow/71324901.cms

No comments