Breaking News

నాని తదుపరి సినిమా ఈ డైరెక్టర్‌తోనే!!


నేచురల్ స్టార్ నాని, నివేథా థామస్ నటీనటులుగా శివ నిర్వాణ తెరకెక్కించిన చిత్రం ‘నిన్నుకోరి’. ఈ సినిమా ఆశించిన దానికంటే గట్టిగానే సక్సెస్ అవ్వడంతో పాటు బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. మరీ ముఖ్యంగా కథ, సాంగ్స్ ఎప్పటికీ యూత్‌కు, లవ్‌లో ఫెయిలైన వారికి గుర్తుండిపోతుంది. అప్పట్లో సినిమా చూడటానికి వెళ్లిన జనాలు ఒకింత భావోద్వేగంతో బయటికి వచ్చారు కూడా. అదీ శివ నిర్వాణ సినిమా తెరకెక్కించిన తీరు.!

అందుకే ప్రస్తుతం వరుస సినిమాలు అట్టర్‌ప్లాప్ అవుతుండటంతో మరోసారి శివనిర్వాణ దర్శకత్వంలో మూవీ చేయాలని నాని ఫిక్స్ అయ్యాడట. ఈ విషయాన్ని డైరెక్టర్ చెవిన పడేయగా.. వెంటనే వారం రోజులు సమయం అడిగి నాని ఇంటికొచ్చి మరీ ఓ లైన్ చెప్పాడట. సినిమా కథ కాస్త ‘నిన్నుకోరి’, ‘మజిలి’ రేంజ్‌లో టవ్ ట్రాక్‌లో నడుస్తుందని సమాచారం. లైన్ వినగానే ‘సూపర్బ్ నిర్వాణ సార్.. చేసేద్దాం’ అని నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ప్రస్తుతం నాని.. సుధీర్‌బాబు హీరోగా వస్తున్న ‘వి’ అనే చిత్రంలో నెగటివ్ రోల్ చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయ్యే లోపు కథ సిద్ధం చేసుకోవాలని శివనిర్వాణకు నాని చెప్పినట్లు తెలుస్తోంది.

సో.. మొత్తానికి చూస్తే హిట్టిచ్చి డైరెక్టర్‌తోనే నాని సినిమా చేయబోతున్నాడన్న మాట. వాస్తవానికి నాని ఇప్పటి వరకూ చేయాల్సిన ప్రయోగాలన్నీ చేసేశాడు. మరోవైపు శివనిర్వాణ సైతం రెండే రెండు సినిమాలు ‘నిన్నుకోరి’, ‘మజిలీ’ మంచి పేరు సంపాదించుకున్నాడు. మరి ముచ్చటగా నిర్వాణ మూడో సినిమా ఎలా ఉండబోతోందో .. అసలు ఈ పుకార్లలో ఎంతవరకూ నిజానిజాలున్నాయో తెలియాల్సి ఉంది మరి.



By September 28, 2019 at 11:05PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/47648/natural-star-nani.html

No comments