Breaking News

‘సాహో’ డే-2 కలెక్షన్స్.. ప్రభాస్ బాక్సాఫీస్ ప్రభంజనం


‘బాహుబలి’గా ప్రపంచాన్ని గెలిచివచ్చిన ఇప్పడు ‘సాహో’ అంటూ మరో భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆ సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినా ముందు నుండి ఉన్న ప్రీ రిలీజ్ హైప్ వల్ల ఆ సినిమా మొదటి రోజు అసాధారణమైన ఓపెనింగ్స్ తెచ్చుకుంది. అన్ని భాషలు, అన్ని స్క్రీన్స్ కలుపుకుని మొదటి రోజు ఏకంగా రూ. 130 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఆ టాక్‌తో ఆక్యుపెన్సీ తగ్గకుండా ఈ రేంజ్ కలెక్షన్స్ తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. అయితే ‘సాహో’ ప్రభంజనం మొదటిరోజుకే పరిమితం అనుకున్నారు అంతా. కానీ రెండో రోజు కూడా బాక్స్ ఆఫీస్‌ని కలెక్షన్స్ వరదతో ముంచెత్తింది ‘సాహో’. హిందీ వెర్షన్ వరకు మొదట రోజు రూ. 24 కోట్లకు పైగా కొల్లగొట్టిన ‘సాహో’ సెకండ్ డే చాలా వరకు డ్రాప్ చూపిస్తుంది అనుకున్నారు అంతా. కానీ, అందరి అంచనాలు తప్పని నిరూపిస్తూ వీకెండ్ అడ్వాంటేజ్‌ని వాడుకుంటూ ఏకంగా రూ. 26 కోట్ల షేర్‌‌ని రాబట్టింది. ఇదే ట్రెండ్ కొనసాగితే ఫస్ట్ వీకెండ్‌లో ‘సాహో’ హిందీ వెర్షన్ నుండే రూ. 70 కోట్లు రాబట్టే అవకాశం ఉంది. Also Read: అలాగే తెలుగులోనూ రెండో రోజు ‘సాహో’ ప్రభంజనం కొనసాగింది. రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 10 కోట్లకి పైగా షేర్ రాబట్టింది. నైజాంలో మొదటిరోజే ‘బాహుబలి’ రికార్డ్‌ను దక్కించుకున్న ‘సాహో’.. రెండో రోజు అదే దూకుడు కొనసాగిస్తూ రూ. 5 కోట్ల 20 లక్షల షేర్‌ని రికార్డ్ చేసింది. కర్ణాటక, కేరళ, తమిళనాడులో రెండో రోజు డీసెంట్ ఆక్యుపెన్సీ దక్కించుకుంది. ఆ మూడు స్టేట్స్ వరకు రూ. 10 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఓవరాల్‌గా చూసుకుంటే సెకండ్ డే ఇండియా మొత్తంగా రూ. 60 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. దీంతో రెండు రోజులకి సాహో కలెక్షన్స్ ఇండియా గ్రాస్ రూ. 164.9 కోట్లుగా ఉంది. షేర్ రూ. 99.4 కోట్లు. మూడో రోజు ఇదే ఊపు కొనసాగితే.. వినాకయ చవితి సెలవు కూడా కలిసివస్తుంది కాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర ‘సాహో’ అద్భుతాలు చెయ్యకపోయినా సేఫ్ అయిపోవడం దాదాపు ఖాయం. అయితే ‘సాహో’కి వచ్చిన టాక్‌, క్రిటిక్స్ ఇచ్చిన రేటింగ్స్‌‌ని చూసి కూడా హిందీ వెర్షన్‌లో సెకండ్ డే ఆ రేంజ్ ఆక్యుపెన్సీ కనిపించింది అంటే బాలీవుడ్ ప్రేక్షకులు ప్రభాస్‌ని పాన్ ఇండియా స్టార్‌గా యాక్సెప్ట్ చేసారు అనుకోవాల్సిందే. ఒక మోస్తరు సినిమాకే ప్రభాస్ ప్రభంజనం ఇలా ఉంటే ఒక హిట్ పడితే ఆ తరువాత రేంజ్ వేరేగా ఉంటుంది. ఈ కలెక్షన్స్ చూసాక ప్రభాస్ నెక్స్ట్ సినిమా కూడా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదు.


By September 01, 2019 at 12:16PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/prabhas-saaho-movie-collects-rs-160-crore-gross-at-indian-box-office/articleshow/70932235.cms

No comments