బిగ్‌బాస్: ఈ వారం ఈ భామ అవుట్!
రోజులు దగ్గర పడే కొద్దీ బిగ్ బాస్ సీజన్ 3 ఆసక్తికరంగా మారుతుంది. బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు అలానే హౌస్ మేట్స్ మధ్య గొడవలు ఇలా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. అయితే ప్రతి వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో ముందుగానే తెలిసిపోతుంది. అలానే ఈవారం కూడా ఎవరు ఎలిమినేట్ అవుతారో ముందే తెలిసిపోయింది.
ఇది పక్కన పెడితే... వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఇప్పటికే ఇద్దరు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో మొదటగా ఎంట్రీ ఇచ్చిన ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి తన ప్రవర్తన మరియు పరుష పదజాలం వలన కొద్దిరోజులకే తిరస్కరణకు గురై హౌస్ నుండి వెళ్లిపోవడం జరిగింది. ఇక లేటెస్ట్ గా వచ్చిన శిల్పా చక్రవర్తి ప్రవర్తన కూడా అంత ఆశాజనకంగా లేదు.
అసలు ఆమె హౌస్ లో ఉన్నట్టే లేదు. ఆమె హౌస్ లోకి అడుగు పెట్టినప్పుడు నుండి ఎవరితో పెద్ద క్లోజ్ గా మూవ్ అవ్వడంలేదు. ఆమె వాలకం చూస్తుంటే సేఫ్ గేమ్ ఆడటానికి వచ్చినట్టు ఉంది. ఈ వారం ఆమె ఎలిమినేషన్‌లో ఉంది. ఈ వీక్ ఆమెకు తక్కువ ఓట్లు పడినట్టు తెలుస్తుంది. దాంతో ఈ వారం శిల్ప నే హౌస్ నుండి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. గత రెండు సీజన్స్ తో పోల్చుకుంటే ఈ సీజన్ వైల్డ్ కార్డు ఎంట్రీస్ చాలా చప్పగా ఉన్నాయి.
By September 15, 2019 at 04:36AM
No comments