పిక్: ‘మహానటి’లో ఆ.. గ్లో ఏది?
మొదటినుండి కాస్త బొద్దుగా ఉన్న హీరోయిన్ కీర్తి సురేష్ మహానటి సినిమా టైములో బాగా బరువు పెరిగింది. మహానటి సినిమా షూటింగ్ టైం లో కీర్తి సురేష్ బయట ఎక్కడ కనబడినా కాస్త లావుగానే కనబడేది. మహానటి సినిమా కోసమే బరువు పెరిగిన కీర్తి సురేష్ ఆ సినిమా సూపర్ హిట్ అయినా.. ఓ ఏడాది పాటు ఖాళీగానే ఉంది. అవకాశాలు రాకో.. లేదంటే బరువు తగ్గే ప్రయత్నంలో సినిమాలు కాదనుకుందో తెలియదు కానీ.. 2019లో మాత్రం టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ సినిమా అవకాశాలతో ఆమె డైరీ ఫుల్ అయ్యి.. కళకళలాడుతుంది.
కీర్తి సురేష్ బాగా బరువు తగ్గి నాజూగ్గా తయారయ్యాకే ఆమెకి చేతినిండా సినిమాలున్నాయి. అయితే బొద్దుగా ఉన్నప్పుడు ముఖంలో కాంతి, కళ కనబడేవి. కానీ బాగా సన్నబడ్డాక కీర్తి సురేష్ ఫేస్‌లో కళ మొత్తం మాయమైంది. తాజాగా ఓనం సెలెబ్రేషన్స్ కోసం చీర కట్టిన కీర్తి సురేష్ ఫేస్‌లో గ్లో లేకుండా పోయింది. అంతగా కాంతివంతంగా కనబడలేదు. కానీ అమ్మడు మాత్రం బాగా సన్నబడి నాజూగ్గా తయారైంది. ఫేస్‌లోనే కాదు నిశితంగా పరిశీలిస్తే.. ఆమె మెడ, చేతులు ఇలా ఎక్కడ గ్లో కనిపించలేదు. ఇక కీర్తి సురేష్ నవ్వితే బావుండేది. కానీ ఇప్పుడు ఈ ఫొటోలో చూస్తున్న ఆమె నవ్వులో ఎక్కడా జీవ కళే లేదు అన్నట్టుగా ఉంది.
By September 15, 2019 at 04:23AM
No comments