హైదరాబాద్‌లో గ్యాంగ్‌రేప్.. భర్తను బంధించి భార్యపై యజమానుల రేప్
హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తమ వద్ద పనిచేసే వ్యక్తితో జరిగిన గొడవ కారణంగా ఇద్దరు యజమానులు అతడి భార్యను నిర్బంధించి మరో ఇద్దరితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. Also Read: నాగర్‌కర్నూలు జిల్లా ఎనిమిల్ల తండాకు చెందిన చందు తన భార్యాపిల్లలతో కలిసి కొంతకాలం క్రితం శివారులోని మహేశ్వరం ప్రాంతానికి వలస వచ్చి ఓ ఫాంహౌస్‌లో పనికి కుదిరాడు. ఫాంహౌస్ యజమానులు రంగారెడ్డి, ప్రతాప్‌రెడ్డి తరుచూ వేధిస్తుండటంతో చందు ఈ నెల 18వ తేదీన వారితో గొడవపడ్డాడు. అనంతరం తాను పని మానేస్తున్నానని చందు చెప్పడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడి భార్యను ఓ గదిలో నిర్బంధించి తాము చెప్పినట్లు వినాలని బెదిరించారు. రాత్రివేళ రంగారెడ్డి, ప్రతాప్‌రెడ్డితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఆమెను ఫాంహౌస్‌లోని ఓ గదిలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. Also Read: వారి బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు భర్తతో కలిసి 19వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బయలుదేరింది. ఈ విషయం తెలుసుకున్న నిందితులు తరపువారు బాధితులను అడ్డగించి బుజ్జగించారు. ఎంతోకొంత ఆర్థికసాయం అందిస్తామని, తమ పరువు తీయొద్దని వేడుకుని భార్యభర్తలను స్వగ్రామానికి పంపించేశారు. అయితే తనపై జరిగిన అఘాయిత్యానికి కుమిలిపోయిన మహిళ భర్తకు ధైర్యం చెప్పి గురువారం హైదరాబాద్ చేరుకుని పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ కేసును వనస్థలిపురం ఏసీపీ గాంధీనారాయణ పర్యవేక్షిస్తున్నారు. Also Read: గమనిక: అత్యాచారాలు, లైంగిక వేధింపుల కేసుల్లో బాధితులకు సంబంధించి గోప్యత పాటించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారి పేర్లు, వివరాలు వెల్లడించడంలేదు.
By September 27, 2019 at 08:32AM
No comments