MP సెక్స్ రాకెట్ కేసు: బీ గ్రేడ్ హీరోయిన్‌లు, మాజీ సీఎం, బ్యూరోక్రాట్లు!
మధ్యప్రదేశ్‌లో సెక్స్ రాకెట్ కుంభకోణంలో తీగలాగే కొద్దీ పెద్ద పెద్ద డొంకలే కదులుతున్నాయి. ఈ వ్యవహారంలో మాజీ గవర్నర్, మాజీ సీఎంలు సహా పలువురు రాజకీయ ప్రముఖులు, ఐఏఎస్‌లు చిక్కుకోవడం దుమారం రేగుతోంది. ఎక్కడ తమ పేరు బయటకు వస్తుందోనని నేతలు హడలెత్తిపోతున్నారు. హనీ ట్రాప్ కేసులో నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో బీ-గ్రేడ్ హీరోయిన్‌ల సహా 40 మందికి పైగా కాల్ గర్ల్స్ ప్రైవేట్ వీడియోలను చూపించి బ్లాక్ మెయిల్‌కు పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ వీడియో క్లిప్‌లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిన సిట్, నివేదిక తర్వాత బలంగా వేళ్లూనుకొనిపోయిన బ్లాక్ మెయిలింగ్ వ్యవస్థను, వ్యక్తులను గుర్తిస్తామని సిట్ వర్గాలు వెల్లడించాయి. ఉన్నతాధికారులు, రాజకీయ నేతలు అభ్యంతకర రీతిలో ఉన్నప్పుడు చిత్రీకరించిన 92 హైక్వాలిటీ వీడియో క్లిప్పింగ్స్ పోలీసుల చేతికి చిక్కాయి. అలాగే, వీరితో చాటింగ్ చేసిన మెసేజ్‌లు, ఆడియో క్లిప్పులు, వీడియో క్లిప్పింగ్‌కు సంబంధించి దాదాపు 4000 ఫైల్స్ నిందితుల వద్ద లభించాయి. ఈ రాకెట్‌తో సంబంధం ఉందని అనుమానిస్తున్న ఐదుగురు యువతలను అరెస్ట్ చేసి, రెండు ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. అయితే, వీరిలో కొందరు మైనర్లు ఉన్నారని తెలుస్తోంది. దీంతో కేసు విచారణకు కొంత ఆటంకం కలుగుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విచారణలో వెలుగుచూస్తున్న వాస్తవాలను చూసి పోలీసులు విస్తుపోతున్నారు. మధ్యప్రదేశ్‌లోని పవర్‌ఫుల్ మంత్రులు, ఉన్నతాధికారులను టార్గెట్ చేసినట్టు గుర్తించారు. మొత్తం 13 మంది సీనియర్ ఐఏఎస్ అధికారుల జాబితాను రూపొందించి, వారిని ఎలా ఉచ్చులోకి లాగాలి, ఎవరిని ఎరగా వేయాలనే అంశాలను కోడ్ లాంగ్వేజ్ రాసుకున్నట్టు సిట్ విచారణలో బహిర్గతమైంది. అయితే, దీని వెనుకున్న అసలు సూత్రధారి ఎవరు? వీరికి టార్గెట్ సెట్ చేసిన వ్యక్తులెవరనేది? ప్రశ్నార్థకంగా మారింది. ఈ ముఠా జాబితాలో అగ్రికల్చర్, ఫిషరీస్, కల్చర్, ఇండస్ట్రీస్, పట్టణాభివృద్ధి, లేబర్, అటవీ, జలవనరులు, పబ్లిక్ రిలేషన్స్ తదితర విభాగాల్లో పనిచేసి వివిధ అధికారులు ఉన్నారు. వీరి పేర్లకు బదులుగా నిక్ నేమ్స్, కోడ్‌లు మార్క్ చేశారు. టార్గెట్ లిస్ట్‌లో ఉన్న అధికారులు ఎవరో గుర్తించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. హనీట్రాప్ అనుమానితుల్లోని ముగ్గురిపై మానవ అక్రమ రవాణా కేసును సీఐడీ బుధవారం నమోదుచేసింది. ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ ఇంజినీర్ హర్బజన్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఓ యువతిని అరెస్ట్ చేశారు. ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ముగ్గురిపై అక్రమ రవాణా కేసు నమోదయ్యింది. సెక్స్ రాకెట్ కేసులో తమ నేతలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, దీనిని సీబీఐకి అప్పగించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గియా డిమాండ్ చేయడం విశేషం. రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారుల హనీట్రాప్ కేసులో శ్వేతా స్వాప్నిల్ జైన్ అనే మహిళను సిట్ అరెస్టు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాను లక్ష్యంగా చేసుకున్న వారిని గెస్ట్‌హౌస్ లేదా తాను ఎంపిక చేసుకొన్న ఫైవ్ స్టార్ హోటల్‌కు శ్వేతా ఆహ్వానించేది. సదరు వ్యక్తి అధికారిక పర్యటనల నిమిత్తం ముంబయి, ఢిల్లీ వెళ్లినప్పుడు టాప్ మోడల్స్, కాల్‌గర్ల్స్, బాలీవుడ్ నటులను ఎరవేసేది.. వారు శృంగారంలో పాల్గొంటుండగా చాటుగా వీడియోను చిత్రీకరించి, తర్వాత వాటిని చూపి సదరు వ్యక్తులను బ్లాక్‌మెయిల్ చేసేవారు. తన భర్త నిర్వహిస్తోన్న స్వచ్ఛంద సంస్థ కోసం నిధులు సేకరించే క్రమంలో శ్వేత పలువురుని హనీట్రాప్‌లోకి లాగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె భర్త నుంచి ఐదు హార్డ్ డిస్కులను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం తనకు భోపాల్‌లోని ఖరీదైన ప్రాంతం మినల్ రెసిడెన్సీలో ఒక బంగ్లా బహుమతిగా ఇచ్చినట్లు విచారణలో శ్వేతా అంగీకరించారు. శ్వేతా జైన్‌తో పాటు, మరో మహిళ ఆర్తీ దయాల్ కూడా ఓ ఐఏఎస్ అధికారి నుంచి ఒక ఫ్లాట్ పొందినట్టు తెలిపింది.
By September 26, 2019 at 01:45PM
No comments