వైజాగ్ ఆర్మీ జవాన్‌ది హత్యే.. ప్రియుడితో కలిసి చంపేసిన భార్య
భర్త సైన్యంలో పనిచేస్తుంటే భార్య ఓ వ్యక్తితో పెట్టుకుంది. అతడేమో దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తుంటే ఇక్కడే ఆమె ఇంట్లో ప్రియుడితో రాసలీలలు కొనసాగించింది. సెలవులపై ఇంటికొచ్చిన అతడికి భార్య అక్రమ సంబంధం గురించి తెలియడంతో నిలదీశాడు. దీంతో తన సంతోషానికి అడ్డొస్తున్నాడన్న కక్షతో భర్తను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించింది. అయితే ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన సైనికాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. Also Read: విశాఖపట్నం మద్దిలపాలెం ప్రాంతానికి చెందిన సతీష్‌కుమార్(32) సైన్యంలో పనిచేస్తుంటాడు. అతడికి గతంలో జ్యోతి అనే మహిళతో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. సతీశ్ దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తుంటే... జ్యోతి, అత్త, ఇద్దరు పిల్లలతో కలిసి వైజాగ్‌లోనే ఉంటోంది. ఆగస్టు నెలలో సెలవులపై ఇంటికి వచ్చిన సతీశ్ 19వ తేదీన ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయాడని జ్యోతి ఎంవీపీ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కుటుంబసభ్యులు ఎలాంటి అనుమానం వ్యక్తం చేయకపోవడంతో పోలీసులు సూసైడ్ కేసుగా నమోదు చేసుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. Also Read: అయితే అత్యుత్సాహానికి పోయిన జ్యోతి సైన్యం నుంచి భర్తకు రావాల్సిన డబ్బుల కోసం సతీశ్ చనిపోయిన మరుసటి రోజు నుంచే అధికారులపై ఒత్తిడి తీసుకురావడం మొదలు పెట్టింది. తరుచూ కార్యాలయానికి వెళ్తూ వారికి చికాకు తెప్పించేంది. ఆమె మొహంలో భర్త చనిపోయినట్లు ఎలాంటి విచారం కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన సైనికాధికారులు సతీశ్ మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలని పోలీసులను కోరారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జ్యోతిపై నిఘా పెట్టగా షాకిచ్చే విషయం తెలిసింది. సతీశ్‌ను జ్యోతి ప్రియుడితో కలిసి చంపినట్లు తేలడంతో కుటుంబసభ్యులంతా షాకయ్యారు. జ్యోతికి 9 నెలల క్రితం పాత జైలురోడ్డుకు చెందిన సిమ్మా భరత్‌కుమార్(24) అనే యువకుడితో పరిచయం ఏర్పడి అది కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది. కోడలి ప్రవర్తన గమనించి అత్తగారు మందలించినా ఆమె పట్టించుకోలేదు. దీంతో గత నెలలో సెలవులపై వచ్చిన సతీశ్‌కు జ్యోతి వ్యవహారం గురించి చెప్పింది. దీంతో అతడు భార్యను పద్ధతి మార్చుకోవాలని మందలించాడు. తన సంతోషానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన జ్యోతి అతడిని చంపేందుకు ప్లాన్ వేసింది. ఆగస్టు 18న సతీశ్ తాగిన మద్యంలో జ్యోతి నిద్రమాత్రలు కలిపింది. అతడు నిద్రలోకి జారుకున్న తర్వాత జ్యోతి ప్రియుడు భరత్‌కుమార్, అతడి ఫ్రెండ్ భాస్కర్‌రావు ఇంట్లోకి చొరబడి సతీశ్ మెడకు చున్నీని బిగించి హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని ఫ్యాన్‌కు ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. ముగ్గురు నిందితులను పోలీసులు మంగళవారం మీడియా ఎదుట హాజరుపరిచారు.
By September 11, 2019 at 09:48AM
No comments