Breaking News

హీరోయిన్స్‌పై విజయశాంతి షాకింగ్ కామెంట్స్


ఒకప్పుడు విజయశాంతి అంటే చిరంజీవి, నాగార్జులకు సమానంగా చూసేవారు. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు విజయశాంతి పెట్టింది పేరు. చిత్ర పరిశ్రమలో విజయశాంతిలా రాణించాలని అనుకోని నటీమణులు ఉండరు. ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి హీరోలకు ఏమాత్రం తీసిపోని విజయశాంతి రాజకీయాల్లోకి వెళ్లడంతో దాదాపు 13 ఏళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మళ్లీ ఆమె సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టారు. అయితే ఇప్పుడున్న నటీమణుల్లో ఎవరంటే ఇష్టం అని అడిగిన ప్రశ్నకు అనూహ్యమైన సమాధానం ఇచ్చారు. ఇప్పుడున్న వారిలో తనకు ఎవ్వరూ నచ్చలేదని, ఎవ్వరూ తనను ఇంప్రెస్ చేయలేకపోయారని అన్నారు. చిత్ర పరిశ్రమలో ఎందరో నటీమణులు ఉన్నారు కానీ ఎవ్వరికీ పని మీద ఫోకస్ లేదని చెప్పారు. ఆ రోజుల్లో తనలాంటి హీరోయిన్స్ 24 గంటలూ పని చేస్తుండేవారని, ఏడాదిలో ఒకేసారి 18 సినిమాలు చేసేవారని తెలిపారు. కానీ ఇప్పుడున్న నటీమణుల్లో ఎక్కడ అలసిపోతారోనని ఏడాదికి రెండు మూడు సినిమాలు మాత్రమే చేస్తున్నారని కామెంట్ చేశారు. ఇప్పటి నటీమణులు చేస్తున్న సినిమాల్లో ఏవీ తనను ఇంప్రెస్ చేయలేదని పేర్కొన్నారు. కష్టం అనే పదానికి అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉందని విజయ శాంతి అన్నారు. అప్పట్లో సినిమాలకు ఉపయోగించే టెక్నాలజీ చాలా డిఫరెంట్‌గా ఉండేదని, దర్శకులు, నిర్మాతలు ఎంపిక చేసుకునే కథలు ఎంతో విభిన్నంగా ఉండేవని అన్నారు. ఎన్టీఆర్, కృష్ణలాంటి స్టార్ హీరోలు ఇరవై రోజుల్లో సినిమా షూటింగ్‌లు పూర్తి చేసేసేవారని చెప్పారు. కానీ ఈ మోడ్రన్ యుగంలో దర్శక, నిర్మాతలు ఎంపిక చేసుకునే కథలు, వాటి నేపథ్యం భారీ తనంతో ఉంటుండడంతో సింపుల్ సినిమాలను పూర్తి చేయడానికి 100 రోజులకు పైగా సమయం పడుతోందని చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ విజయ శాంతి ఒక విషయం గమనించాలి. ఆమె హీరోయిన్‌గా సినిమా పరిశ్రమను ఒక ఊపు ఊపేస్తున్న సమయంలో తనకు ఎన్నో సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చేవి. డబ్బు కోసమో లేక పేరు కోసమో విజయ శాంతి వరుసగా ఏడాదికి 18 సినిమాలు చేసి ఉండొచ్చు. కానీ ఇప్పటి పరిస్థితి అలా కాదు. ఏడాదికి ఒక్క మంచి సినిమా దొరికినా చాలు అనుకునే నటీమణులు ఎందరో ఉన్నారు. కానీ అవకాశాలు రాకో లేద కథలు దొరక్కో చిన్న సినిమాలకు కూడా సంతకాలు చేసేస్తూ నెట్టుకొస్తున్నారు.


By September 11, 2019 at 09:31AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/none-of-the-present-day-heroines-has-impressed-me-says-versatile-actress-vijayashanti/articleshow/71074775.cms

No comments