Chalo Atmakur: ఆ ముగ్గుర్ని కాపాడటం కోసమే బాబు కుట్రలు.. విజయసాయి సెటైర్లు
అధికార, ప్రతిపక్షాలు పోటాపోటీగా ‘చలో ఆత్మకూరు’ కార్యక్రమానికి పిలుపునివ్వడంతో గుంటూరు రాజకీయాలు హీటెక్కాయి. ఇరు పార్టీలకు చెందిన నేతలెవరూ ఆత్మకూరు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. చంద్రబాబు, నారా లోకేశ్ సహా పలువురు నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగాలని శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. దీంతో టీడీపీ నేతలు ధర్నాలకు దిగుతున్నారు. టీడీపీ చేపట్టిన కార్యక్రమంపై వైఎస్ఆర్సీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఘాటుగా స్పందించారు. యరపతినేని, కోడెల, దూడలను రక్షించుకునేందుకే ఈ డ్రామా అంటూ టీడీపీ నేతలపై ఆయన సెటైర్లు వేశారు. పల్నాడులో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని రచ్చ చేసి కొత్త పరిశ్రమలు రాకుండా అడ్డుకోవడానికి చంద్రబాబు దొంగల ముఠా కుట్రలు ప్రారంభించిందని ఆయన ఆరోపించారు. పల్నాడులో చంద్రబాబు హయాంలో ఐదేళ్లు రౌడీ రాజ్యం నడిచిందని విజయసాయి ఆరోపించారు. ఈ ప్రాంతంలో ప్రశాంతత నెలకొనడం బాబుకు ఇష్టం లేదని అర్థమవుతోందంటూ ఆయన మండిపడ్డారు. పేదల జోలికి వస్తే ఊరుకోమన్న చంద్రబాబు వ్యాఖ్యలపై కూడా విజయసాయి సెటైర్లు వేశారు. ఆయన దృష్టిలో పేదలు వీళ్లేనంటూ.. కోడెల, యరపతినేని, చింతమనేని ప్రభాకర్‌ల ఫొటోను ఉంచి సైరా పంచ్ వేశారు. Read Also:
By September 11, 2019 at 09:43AM
No comments