Breaking News

రూ.23 కోట్ల ఖరీదైన చేప గాలానికి చిక్కగానే ఇలా చేశారు..


రూ.23 కోట్ల విలువైన చేప వలకు చిక్కితే.. జాక్ పాట్ తగిలినట్టే కదూ. ఇంత ఖరీదైన చేప ఉంటుందా? అనుకుంటున్నారా? ట్యూనా చేపలకు భారీ డిమాండ్ ఉంటుందనే సంగతి తెలిసిందే కదా. జపాన్‌లో వీటికి భారీ గిరాకీ ఉంటుంది. ఐర్లాండ్‌కు చెందిన డేవ్ ఎడ్వర్డ్స్ తన టీంతో కలిసి చేపల వేటకు వెళ్లాడు. వీరికి ఎనిమిదిన్నర అడుగుల పొడవు, 270 కిలోల బరువైన భారీ దొరికింది. జపాన్‌లో ఈ చేపను విక్రయిస్తే రూ.23 కోట్లు వస్తాయి. కానీ డేవ్ టీం ఆ చేపను తిరిగి నీటిలోకి వదిలేసింది. భారీ మొత్తంలో డబ్బులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఇలా ఎందుకు వదిలేశారని ప్రశ్నించగా.. చేపలను సొమ్ము చేసుకోవడం కోసం మేం వాటిని పట్టడం లేదు. అట్లాంటిక్ మహా సముద్ర జలాల్లో ఎలాంటి జలచరాలు ఉన్నాయో తెలుసుకోవడం కోసమే మేం ఇలా చేపలను పడుతున్నాం అని తెలిపారు. 15 బోట్లలో సముద్రంలోకి వెళ్లి చేపలను పట్టుకొని వదిలేస్తున్నారు. ఈ కార్యక్రమం అక్టోబర్ 15 వరకు సాగనుంది. భారీ ట్యూనా చేప చిక్కిన ఫొటోలు వెస్ట్ కార్క్ చార్టర్స్ అనే ఫేస్ బుక్ పేజీలో షేర్ చేశారు. చేప దొరికినా వదిలేసిన డేవ్‌పై నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు.


By September 29, 2019 at 10:26AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/man-catches-giant-tuna-worth-rs-23-crores-and-throws-it-back-to-ocean/articleshow/71357265.cms

No comments