Breaking News

ఆ కంపెనీలో వారి కోరిక తీర్చిన మహిళలకే ప్రమోషన్లు.. ఇండోర్‌లో కీచక సోదరులు


తమ సంస్థలో పనిచేసే మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధిస్తున్న సోదరులను మధ్యప్రదేశ్‌లోని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరు ఎన్నారై అని పోలీసులు తెలిపారు. ఇండోర్‌లో ఓ సాఫ్ట్‌వేర్ సంస్థ నిర్వహిస్తున్న వారిద్దరు మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధిస్తున్నారు. కొందరిని ఒంటరిగా ఛాంబర్‌కు పిలిపించుకుని కోరిక తీరిస్తే ప్రమోషన్లు ఇస్తామని, లేదంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామని బెదిరిస్తున్నారు. అందుకు ఒప్పుకోని వారిని నోటీసులు లేకుండా ఉద్యోగం నుంచి తీసేస్తున్నారు. ఇలా వారి బారిన పడి ఉద్యోగం కోల్పోయిన కొందరు మహిళలు ఇండోర్‌లోని విజయ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. Also Read: పోలీసులకు చేసిన ఫిర్యాదులో బాధితులు పేర్కొన్న విషయాలు చూస్తూ ఆ కామాంధులు ఎంతగా వేధిస్తున్నారో అర్ధం అవుతుంది. తమను రోజూ అవసరం లేకపోయిన ఛాంబర్‌కు పిలుస్తారని, ఎక్కడెక్కడో చేతులు వేస్తూ అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు కోరిక ఎప్పుడు తీరుస్తావంటూ అసహ్యంగా మాట్లాడేవారని బాధితులు పోలీసులకు చెప్పారు. గతవారం బిజినెస్ ట్రిప్ పేరుతో ముగ్గురు ఉద్యోగినులను గోవాకు తీసుకెళ్లిన అన్నదమ్ములు అక్కడ వారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని తెలిపారు. బాస్‌లతో సెక్స్‌కు అంగీకరించకపోవడంతో తిరిగి ఇండోర్ వచ్చేటప్పటికే వారిని ఉద్యోగం నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోదరులిద్దరినీ అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. Also Read: Also Read:


By September 29, 2019 at 10:41AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/indore-brothers-arreted-over-sexual-harassments-on-woman-employees/articleshow/71357399.cms

No comments