Breaking News

ఈ నెల 19 వరకు జ్యుడీషియల్ కస్టడీ.. తీహార్ జైలుకు చిదంబరం


ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ హోంమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరానికి కస్టడీ ముగియడంతో తీహార్ జైలుకు తరలించారు. సీబీఐ కస్టడీ ముగియడంతో చిదంబరాన్ని ప్రత్యేక న్యాయస్థానంలో అధికారులు హాజరు పరిచారు. జస్టిస్ అజయ్‌కుమార్‌ కుహార్‌ చిదంబరానికి సెప్టెంబరు 19 వరకు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించారు. అవసరమైన ఔషధాలను, కళ్లజోడు ఆయన వెంట తీసుకెళ్లేందుకు కోర్టు అనుమతించింది. నిందుతుడిపై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవని అందువల్ల ఆయనను పోలీస్ కస్టడీ నుంచి రిమాండ్‌కు తరలించాలని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. దర్యాప్తు కొనసాగుతోందని, నిందుతుడు ఈ కేసును ప్రభావితగలిగే శక్తివంతుడి కావడంతో సీబీఐ ఆందోళన చెందుతోంది.. ఈ సమయంలో ఆయనను విడుదల చేయడం సమంజసం కాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. జైలులో చిదంబరానికి ప్రత్యేక గది, సరైన రక్షణ కల్పించాలని ఆయన తరఫు న్యాయవాది కపిల్‌ సిబల్‌ కోర్టును కోరారు. ఆగస్టు 21 నుంచి సీబీఐ కస్టడీలో ఉన్నారు. అంతకముందు ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ఈడీ అరెస్టు చేయకుండా దాఖలుచేసి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను రద్దుచేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్‌ భానుమతి, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్నల ధర్మాసనం సమర్థించింది. ఈ దశలో ఆయనకు బెయిల్‌ ఇస్తే దర్యాప్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని అభిప్రాయపడింది. మరోవైపు సీబీఐ కస్టడీని సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను చిదంబరం ఉపసంహరించుకోగా, అందుకు ధర్మాసనం అంగీకరించింది. కాగా, ఎయిర్‌సెల్ మాక్సీస్ కేసులో చిదంబరం, ఆయన తనయుడు కార్తి చిదంబరానికి ఉపశమనం లభించింది. ఈ కేసులో సీబీఐ అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్‌ను ప్రత్యేక న్యాయస్థానం గురువారం మంజూరు చేసింది. రూ.లక్ష వ్యక్తిగత పూచీకత్తుపై ఇద్దరికీ బెయిల్ మంజూరుచేస్తూ ప్రత్యేక న్యాయమూర్తి ఓపీ సైనీ తీర్పును వెలువరించారు.


By September 06, 2019 at 11:04AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/setback-to-chidambaram-special-cbi-court-sent-him-to-tihar-jail-in-judicial-custody/articleshow/71004568.cms

No comments