కారు డ్రైవర్‌తో బీటెక్ స్టూడెంట్ ప్రేమపెళ్లి.. ఆరో రోజే ఆత్మహత్య
పెళ్లయిన ఆరో రోజే ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజధాని నగరంలో చోటుచేసుకుంది. ప్రేమగా చూసుకుంటాడని నమ్మి అతడితో ఏడడుగులు నడిచిన ఆమెను భర్త దారుణంగా మోసం చేశాడు. మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని భార్యను వేధించాడు. మనోవేదనను తట్టుకోలేక గర్భిణి అయిన ఆ యువతి చావే శరణ్యమనుకుంది. Also Read: చెన్నైలోని త్రిశూలం ప్రాంతానికి చెందిన మనీష(21) ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. అదే ప్రాంతానికే చెందిన కారు డ్రైవర్ అబిన్‌రాజు(24) అనే యువకుడితో ప్రేమలో పడింది. మనీష ప్రేమకు తల్లిదండ్రులు అడ్డుచెప్పడంతో వారిని ఎదిరించి ఆగస్టు 25న ప్రియుడిని పెళ్లి చేసుకుంది. భర్తతో సుఖంగా ఉండొచ్చన్న సంతోషంతో మెట్టినింట్లో అడుగుపెట్టిన మనీషకు అబిన్‌రాజు షాకిచ్చాడు. తనకు ఇంతకుముందే వేరే మహిళతో అక్రమ సంబంధం ఉందని, ఇద్దరినీ బాగా చూసుకుంటానని చెప్పడంతో మనీష కుమిలిపోయింది. భర్త తనను మోసం చేశాడని భావించిన ఆమె పెళ్లయిన ఆరు రోజే ఆగస్టు 30న ఆత్మహత్య చేసుకుంది. Also Read: కుమార్తె ఆత్మహత్యతో షాకైన మనీష తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అబిన్‌రాజు మనీషను మోసం చేసి పెళ్లిచేసుకుని చంపేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి బుధవారం అరెస్ట్ చేశారు. అబిన్ రాజు మరో మహిళతో మాట్లాడిన సంభాషణ, వారిద్దరు చేసుకున్న చాటింగ్ వివరాలను మనీష ఫోన్‌లో పోలీసులు గుర్తించారు. అబిన్‌రాజు మనీషను ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడని, వివాహానికి ముందే ఆమె గర్భం దాల్చిందని పోలీసులు తెలిపారు. Also Read:
By September 06, 2019 at 11:12AM
No comments