ఇంట్లోనే నిరాహార దీక్షకు దిగిన చంద్రబాబు.. గుంటూరు జిల్లాలో టెన్షన్, 144 సెక్షన్ అమలు
ప్రతిపక్ష టీడీపీ, అధికార వైఎస్ఆర్సీపీ పోటాపోటీగా ‘చలో ఆత్మకూరు’కు పిలుపునివ్వడంతో.. ఏపీలో రాజకీయాలు హీటెక్కాయి. గుంటూరు జిల్లాలో ఉద్రిక్తతలు తలెత్తడంతో.. పోలీసులు ముందు జాగ్రత్తగా చంద్రబాబును హౌస్ అరెస్ట్ చేశారు. ఆత్మకూరుకు వెళ్లకుండా చంద్రబాబును అడ్డుకున్నారు. ఆత్మకూరుకు వెళ్లకుండా తనను, టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడం పట్ల ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఇంట్లోనే చంద్రబాబు నిరాహార దీక్షకు దిగారు. రాత్రి 8 గంటలకు దీక్ష చేపట్టనున్నట్టు టీడీపీ అధినేత తెలిపారు. నిర్బంధంతో ప్రజాస్వామ్యాన్ని కాలరాయలేరని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య చరిత్రలో ఇదో బ్లాక్ డేగా అభివర్ణించారు. శాంతియుత నిరసన ప్రదర్శనలను అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. బాధితులకు సంఘీభావంగా నిరసనలు తెలపాలని చంద్రబాబు ఏపీ ప్రజానీకానికి పిలుపునిచ్చారు ‘చలో ఆత్మకూరు’ ఎఫెక్ట్‌తో పల్నాడుతోపాటు గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. మరోవైపు విజయవాడ ఎంపీ కేశినేని నానిని అరెస్ట్ చేసిన పోలీసులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
By September 11, 2019 at 08:55AM
No comments