Breaking News

ఇది తుగ్లక్ పాలనకు పరాకాష్ట.. జగన్ సర్కారుపై లోకేశ్ ఫైర్


వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ బాధితులను సొంతూళ్లకు పంపడం కోసం టీడీపీ చేపట్టిన ‘చలో ఆత్మకూరు’ ఉద్రిక్తంగా మారింది. చంద్రబాబు, సహా పలువురు టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా.. టీడీపీ నేతలు ఎక్కడిక్కడే ఆందోళనలు చేపట్టలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 12 గంటలపాటు నిరాహార దీక్ష చేపడుతున్నట్టు ఆయన ప్రకటించారు. ‘చలో ఆత్మకూరు’ను పోలీసులు అడ్డుకోవడంతో.. టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ బాధితులకు జరిగిన అన్యాయానికి నిరసనగా టీడీపీ తలపెట్టిన కార్యక్రమానికి ఈ అసమర్థ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. మొన్నటివరకూ జగన్ ఇంటి దగ్గర 144 సెక్షన్ అమలు చేశారు, నిన్నటి నుంచి పల్నాడులో.. ఈ రోజు ప్రతి టీడీపీ నాయకుడి ఇంటి ముందు అమలు చేస్తున్నారు. ఇది తుగ్లక్ పాలనకు పరాకాష్ట అంటూ లోకేశ్ ఘాటుగా విమర్శలు గుప్పించారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన లోకేశ్‌ను సైతం పోలీసులు ఇంట్లోకి పంపించారు. మరోవైపు చంద్రబాబు ఇంటికి వెళ్లడానికి ప్రయత్నించిన టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, నన్నపనేని రాజకుమారిలను పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు ఇంట్లోకి వెళ్లకుండా తనను అడ్డుకోవడంపై అచ్చెన్నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు.


By September 11, 2019 at 09:12AM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/chalo-atmakur-tdp-leader-nara-lokesh-fires-on-ys-jagan-rule/articleshow/71074548.cms

No comments