Sri Reddy: ‘సాహో’ని ఫ్లాప్ అంటున్నది ఆ హీరో ఫ్యాన్సే: పుల్ల పెట్టిందిగా!
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiznnF_dSNJNvA7yvMGlS2F8Mp5p3q7_b2yjJ-12wu0tJ_HB8Frugro8tY7agbK2o40802tzyVnkF7SLEmUEF0SRc3h4PFPyKfHtXXVQw_fa3WMWAne87UyT4uozsGJ74M24g_TnYYg4Wc/s320/Movie.jpg)
![](https://telugu.samayam.com/photo/70905087/photo-70905087.jpg)
దాదాపు రెండున్నరేళ్ల శ్రమ.. వందలాది కోట్లు.. స్టార్ క్యాస్టింగ్.. హాలీవుడ్ టెక్నీషియన్లతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌తో ‘సాహో’ చిత్రాన్ని రూపొందించారు యువ దర్శకుడు సుజీత్. చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ ‘రన్ రాజా రన్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న 26 ఏళ్ల అనంతపురం కుర్రాడి స్టఫ్ తెలుసుకుని పిలిచి మరీ సినిమా ఆఫర్ ఇచ్చారు ప్రభాస్. రెండో చిత్రంతోనే స్టార్ దర్శకులు ఎవ్వరూ సాహసం చేశారు దర్శకుడు సుజీత్. సుమారు రూ. 350 కోట్లతో భారీ యాక్షన్ ప్యాక్డ్ మూవీని హైటెక్నికల్ వాల్యూస్‌తో రూపొందించారు. ఇక భారీ అంచనాలతో నేడు విడుదలైన ఈ చిత్రానికి మిక్స్ టాక్ వస్తోంది. అయితే కొంతమంది ట్విట్టర్‌లో పనికట్టుకుని ‘సాహో’ ఫ్లాప్ అంటూ వరుస ట్వీట్లు చేస్తున్నారు. Read Also: ఈ నెగిటివ్ ట్వీట్లను తన వివాదానికి ఆయుధంగా మార్చుకుంది వివాదాస్పద నటి . ‘సాహో’ మూవీ ఎలా ఉంది అంటూనే.. కొంతమంది ఈ సినిమా ఫ్లాప్ అంటూ కామెంట్ చేస్తున్నారు.. వాళ్లు ఎవరో నాకు తెలుసు వాళ్లు పవన్ కళ్యాణ్ ఫ్యాన్’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పీకే ఫ్యాన్స్ గొర్రెల్లారా? మారరా ఏంట్రా మీరు, ప్రభాస్ మూవీపై పడి ఏడుస్తున్నారు అంటూ తనదైన శైలిలో రెచ్చిపోయింది శ్రీరెడ్డి. అయితే ‘సాహో’ సినిమా బాగానే ఉంది అంటూ కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ట్వీట్ చేస్తున్నారు. మరి అవి ఎందుకు కనిపించలేదో శ్రీరెడ్డికి. మొత్తానికి తన పోస్ట్‌తో ప్రభాస్ ఫ్యాన్స్‌కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేసింది శ్రీరెడ్డి.
By August 30, 2019 at 11:54AM
No comments